International Civil Aviation Organization
-
భారత్ ఫిర్యాదు: పాక్‌కు ఐసీఏవో ప్రశ్నలు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ విమానం ప్రయాణించేందుకు వీలుగా గగనతల అనుమతి ఇచ్చేందుకు పాకిస్తాన్ నిరాకరించడాన్ని భారత ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ పౌర విమానాయాన సంస్థ (ఐసీఏవో) దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీఏవో పాక్ వివరణ కోరింది. మోదీ యూఏఈ పర్యటన నేపథ్యంలో పాకిస్తాన్ గగనతలం నుంచి ప్రయాణించేందుకు భారత్ ఆ దేశ ప్రభుత్వాన్ని కోరగా అందుకు అనుమతించలేదు. దీంతో మరో ప్రత్యామ్నాయ మార్గం గుండా ప్రధాని యూఏఈ పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను కేంద్రం రద్దు చేయడంతో పాకిస్తాన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయంటూ దాయాది తమ గగనతలంలో భారత విమానాలు ప్రయాణించకుండా నిషేధం విధించింది. ఇదే అంశం మీద భారత్ అంతర్జాతీయ విమానయాన సంస్థకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును అందుకున్న అంతర్జాతీయ విమానయాన సంస్థ అధ్యక్షుడు ఒలుముయివా బెనార్డ్ అలియూ దీనిపై పాకిస్తాన్ వివరణ కోరారు. పాక్ నుంచి వచ్చే సమాధానం బట్టి తదుపరి చర్యలు ఉంటాయని ఐసీఏవో తెలిపింది. అయితే భారత్‌కు చెందిన వీవీఐపీలు ప్రయాణించే ప్రత్యేక విమానాలకు పాకిస్తాన్ గగనతలంలో అనుమతులపై ఇంకా స్పష్టత లేదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించే విమానానికి ఇప్పటికే రెండుసార్లు అనుమతి నిరాకరించినప్పటికీ.. భారత్ సంయమనం పాటించింది. తాజాగా యూఏఈ పర్యటనకు ప్రధాని నరేంద్రమోదీ బయలుదేరుతున్న నేపథ్యంలో భారత్ మరోసారి గగనతల అనుమతి కోరింది. తాజాగా కూడా పాక్ అనుమతి నిరాకరించడంతో ఫిర్యాదు చేయడమే సరైన చర్యగా భావించి ఫిర్యాదు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. చదవండి : పాకిస్థాన్‌పై భారత్ సీరియస్ -
జీఎంఆర్ అకాడమీకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా గుర్తింపు
హైదరాబాద్: ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ) నుంచి జీఎంఆర్ ఏవియేషన్ అకాడమీకి రీజినల్ ట్రైనింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఆర్టీసీఈ) గుర్తింపు దక్కింది. భారత్‌లో జీఎంఆర్ ఏవియేషన్ అకాడమీకి మాత్రమే ఈ గుర్తింపు లభించినట్లు జీఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. జీఎంఆర్ ఏవియేషన్ అకాడమీ 3-6 నెలల సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్‌ను, ఐసీఏఓ మెంబర్షిప్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. వీటికి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ), ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) వంటి తదితర అంతర్జాతీయ సంస్థల గుర్తింపు ఉంది. ఏవియేషన్ రంగంలో, దానికి సంబంధించిన ఇతర రంగాలలో ప్రొఫెషనల్స్‌ను తయారుచేయటమే తమ అకాడమీ లక్ష్యమని జీఎంఆర్ గ్రూప్ బిజినెస్ చైర్మన్ (ఎయిర్‌పోర్ట్స్) శ్రీనివాస్ బొమ్మిడాల తెలిపారు. -
త్వరలో మలేసియా విమానంపై నివేదిక
అదృశ్యమైన మలేసియా విమానం ఎంహెచ్ 370 ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రాధమిక నివేదిక వచ్చే వారం విడుదల చేస్తామని దేశ ప్రధాని నజీబ్ రజాక్ వెల్లడించారు. విమాన గల్లంతుపై నివేదికను ఇప్పటికే ఇంటర్నేషనల్ సివిల్ ఎవియేషన్ అర్గనైజేషన్ (ఐసీఏఓ)కు పంపినట్లు చెప్పారు. ఐసీఏఓ నుంచి రాగానే ఆ నివేదికను విడుదల చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అయితే విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. అదృశ్యమైన విమానం ఆచూకీ కనుగొనడంలో పూర్తిగా విఫలమైందని గల్లంతైన విమాన ప్రయాణికుల కుటుంబ సభ్యులు, బంధువులు మలేసియా ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాధమిక నివేదికను వచ్చే వారం విడుదల చేస్తామని నజీబ్ రజాక్ వెల్లడించారు. 239 మందితో గత నెల 8వ తేదీన కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయలుదేరింది. ఆ కొద్ది సేపటికే విమానం విమానాశ్రయంతో సంబంధాలు తెగిపోయాయి. నాటి నుంచి విమానం కోసం పలు దేశాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకపోయింది. దాంతో విమానంలో ప్రయాణిస్తున్న తమ బంధులువు ఏమైయ్యారో తెలియక వారి బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనను తీవ్రతరం చేసి ప్రభుత్వం చేతకాని తనం వల్లే ఇలా జరిగిందంటూ విమర్శలు సంధించారు. దాంతో విమానం గల్లంతుపై మలేసియా ప్రభుత్వం ఓ అంతర్గత కమిటీ ఏర్పాటు చేసి త్వరితగతిన నివేదిక అందజేయాని ఆదేశించింది. దీంతో మలేసియా విమానం గల్లంతుపై ప్రాధమిక నివేదిక ప్రజల చేతులలోకి రానుంది.