హైదరాబాద్: విమానాల నిర్వహణ, మరమ్మతు సేవలు అందిస్తున్న జీఎంఆర్ ఏరో టెక్నిక్‌కు యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (ఈసా) ధ్రువీకరణను రద్దు చేసింది. నవంబరు 12 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. యూరోపియన్ యూనియన్ మెంబర్ స్టేట్స్‌లో నమోదైన విమానాలకు ఇక నుంచి ఈ సంస్థ సర్వీసు చేయడానికి వీల్లేదు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌తో సహా ఇతర సంస్థల నుంచి జీఎంఆర్ ఏరో టెక్నిక్ పొందిన ధ్రువీకరణలపైనా ఈ రద్దు ప్రభావం ఉంటుందని ఈసా స్పష్టం చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment