జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ చేతికి జీఎంఆర్‌ కమళంగ ఎనర్జీ | GMR Kamalanga Energy Project to JSW Energy Odisha | Sakshi
Sakshi News home page

జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ చేతికి జీఎంఆర్‌ కమళంగ ఎనర్జీ

Published Tue, Feb 18 2020 7:55 AM | Last Updated on Tue, Feb 18 2020 7:55 AM

GMR Kamalanga Energy Project to JSW Energy Odisha - Sakshi

న్యూఢిల్లీ: జీఎమ్‌ఆర్‌ ఎనర్జీకి చెందిన ఒడిషాలోని 1,050 మెగావాట్ల  థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను సజ్జన్‌ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కొనుగోలు చేయనుంది. డీల్‌ విలువ రూ.5,321 కోట్లు. ఒడిశాలోని ఈ ప్లాంట్‌ను నిర్వహించే జీఎమ్‌ఆర్‌ ఎనర్జీకి చెందిన జీఎమ్‌ఆర్‌ కమళంగ ఎనర్జీ లిమిటెడ్‌లో వంద శాతం వాటాను కొనుగోలు చేయడానికి షేర్‌ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తెలిపింది. ఈ ప్లాంట్‌ కొనుగోలుతో తమ మొత్తం స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 5,609 మెగావాట్లకు చేరుతుందని పేర్కొంది. ఈ ప్లాంట్‌ కొనుగోలుతో  దేశపు తూర్పు ప్రాంతంలోకి విస్తరిస్తామని వివరించింది. కాగా ఈ కొనుగోలుకు వివిధ సంస్థల ఆమోదాలు పొందాల్సి ఉంది. ఈ ప్లాంట్‌ టే కోవర్‌ పూర్తయితే, జేఎస్‌డబ్ల్యూకి వంద శాతం అనుబంధ సంస్థగా జీఎమ్‌ఆర్‌ కమళంగ ఎనర్జీ లిమిటెడ్‌(జీకేఈఎల్‌) మారుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement