
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో (జీహెచ్‌ఐఏఎల్) జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ (జీఏఎల్) 11 శాతం వాటా పెంచుకుంటోంది. మలేసియన్ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్, ఎంఏహెచ్‌బీ (మారిషస్) నుంచి ఈ వాటాను కొనుగోలు చేస్తోంది. డీల్ విలువ సుమారు రూ.484 కోట్లు. మూడు నెలల్లో ఈ లావాదేవీ పూర్తి కానుందని సమాచారం.
డీల్ పూర్తి అయితే జీహెచ్‌ఐఏఎల్‌లో జీఏఎల్ షేరు 74 శాతానికి చేరనుంది. జీహెచ్‌ఐఏఎల్‌లో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 13 శాతం, తెలంగాణ ప్రభుత్వానికి 13 శాతం వాటా ఉంది. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని స్పెషల్ పర్పస్ వెహికిల్ అయిన జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్వహిస్తోంది.