
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ అయిన జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌కు గ్రీస్ విమానాశ్రయ అభివృద్ధి కాంట్రా క్ట్ దక్కింది. ఈ మేరకు గ్రీస్ ప్రభుత్వం లేఖను అందించిందని జీఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. క్రీటా ద్వీపంలోని హెరాక్‌లిఆన్ ఎయిర్‌పోర్ట్ డిజైన్, నిర్మాణం, ఫైనాన్స్‌తో పాటూ కార్యకలాపాల నిర్వహణ బాధ్యత కూడా జీఎంఆర్‌కే దక్కిందని జీఎంఆర్ గ్రూప్ ఎనర్జీ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ బిజినెస్ చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాల తెలిపారు.
మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని ఈక్విటీ రూపంలో, గ్రీస్ ప్రభుత్వ గ్రాంట్స్ ఇతరత్రా మార్గాల ద్వారా సమీకరిస్తామని.. తొలి దశ నిర్మాణ వ్యయం సుమారు 520 మిలియన్ యూరోలు అవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో జీఎంఆర్‌తో పాటూ జీఈకే టెర్నా పార్టనర్‌గా వ్యవహరిస్తుందని.. గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ రాయితీ తొలి దశ ఐదేళ్లతో కలిపి.. 35 ఏళ్ల వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.