ముంబై: వర్ధమాన దేశాల మధ్య వాణిజ్య అవకాశాలను మెరుగుపర్చేందుకు ఏర్పాటైన వరల్డ్ లాజిస్టిక్స్ పాస్‌పోర్ట్(డబ్ల్యూఎల్‌పీ) భారత్‌లో తమ కార్యకలాపాలకు రెండో హబ్‌గా హైదరాబాద్‌ను ఎంచుకుంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూప్ అనుబంధ సంస్థల్లో రెండింటితో జట్టు కట్టింది. డబ్ల్యూఎల్‌పీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, నావ షేవా ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్, ఎమిరేట్స్ స్కైకార్గోతో చేతులు కలిపింది. డబ్ల్యూఎల్‌పీకి దేశీయంగా ముంబై తొలి హబ్ కాగా, హైదరాబాద్ రెండోది కానుంది. ఎగుమతులపరంగా దేశీయంగా హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని డబ్ల్యూఎల్‌పీ సీఈవో మైక్ భాస్కరన్ తెలిపారు. వరల్డ్ లాజిస్టిక్స్ పాస్‌పోర్ట్‌లో ప్రస్తుతం బ్రెజిల్, ఇండొనేషియా, దక్షిణాఫ్రికా తదితర 10 పైగా దేశాలు భాగంగా ఉన్నాయని ఆయన వివరించారు. అలాగే యూపీఎస్, ఫైజర్, సోనీ, జాన్సన్ అండ్ జాన్సన్, ఎల్‌జీ వంటి బహుళ జాతి సంస్థలతో కూడా భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment