
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ పనుల కాంట్రాక్టులను ఎల్ అండ్ టీ, మెగావైడ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ దక్కించుకున్నాయి. ఇందులో ఎల్ అండ్ టీ కాంట్రాక్టు విలువ రూ.3,028 కోట్లు కాగా మెగావైడ్ దక్కించుకున్న కాంట్రాక్టు విలువ రూ.980 కోట్లు. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఈ మేరకు రెండు సంస్థలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసినట్లు జీఎంఆర్ ఇన్‌ఫ్రా ఎక్సే్చంజీలకు తెలిపింది.
కాంట్రాక్టుల ప్రకారం టెర్మినల్ భవంతి విస్తరణతో పాటు ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను 42 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. తద్వారా ప్రస్తుతం వార్షికంగా 1.2 కోట్ల ప్రయాణికులుగా ఉన్న సామర్థ్యాన్ని 3.4 కోట్లకు పెంచనున్నట్లు జీఎంఆర్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment