
ముంబై: జీఎంఆర్ ఛత్తీస్‌గఢ్ సహా 11 విద్యుత్ ప్రాజెక్టుల ఎన్‌పీఏ ఖాతాలను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (ఎన్‌సీఎల్‌టీ) నివేదించాలని బ్యాంకులు నిర్ణయించాయి. ప్రయాగ్‌రాజ్ పవర్ జనరేషన్, జై ప్రకాష్ పవర్ వెంచర్, ఎస్‌కేఎస్ ఇస్పాత్ పవర్, మీనాక్షి ఎనర్జీ, అథెనా ఛత్తీస్‌గఢ్ వపర్ జబువా, కేఎస్‌కే మహానంది, కోస్టల్ ఎనర్జెన్, జిందాల్ ఇండియా థర్మల్ పవర్ తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.
రూ.2,000 కోట్లకు పైగా రుణాలు తీసుకుని, చెల్లింపుల్లో ఒక్కరోజు విఫలమైనా సరే వాటిని ఎన్‌పీఏలుగా గుర్తించాలన్నది ఆర్‌బీఐ ఆదేశాల సారం. ఇలా ఎన్‌పీఏలుగా గుర్తించిన కేసుల్లో 180 రోజుల్లోపు బ్యాంకులు పరిష్కారం కనుగొనాలి. లేదా పరిష్కారం కోసం ఎన్‌సీఎల్‌టీకి నివేదించాల్సి ఉంటుంది. దీంతో 11 ఎన్‌పీఏ ఖాతాలను ఎన్‌సీఎల్‌టీకి