
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియురాలు మృతి చెందగా.. ప్రియుడి పరిస్థితి విషమంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓయో లాడ్జిలో బుధవారం శ్రావణి, అజయ్ అనే ప్రేమజంట పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. ఈ ఘటనలో యువతి ప్రమాదస్థలంలోనే మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న యువకుడ్ని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిరువురు ఆత్మహత్య చేసుకున్నారా లేక శ్రావణిని చంపి అజయ్ ఆత్మహత్యాయత్నం చేశాడా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ప్రేమజంట ఓయో లాడ్జిలోకి వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment