వినియోగదారులకు హోటల్ రూములను సమకూర్చే అతిథ్య రంగ కంపెనీ ఓయోకు న్యూ ఇయర్-2022 వేడుకలు కాసుల వర్షాన్ని కురిపించాయి. ప్రపంచవ్యాప్తంగా కొత్త ఏడాది వేడుకలను జరుపుకునేందుకు కస్టమర్లు భారీ సంఖ్యలో ఓయో రూమ్స్‌ను తలుపు తట్టారు.
110 కోట్ల బిజినెస్..!
న్యూ ఇయర్ 2022 వేడుకల కోసం హాస్పిటాలిటీ చైన్ ఓయోను ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది బుకింగ్స్ జరిపినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ వీకెండ్‌లో సుమారు రూ. 110 కోట్ల విలువైన బుకింగ్‌లు జరిగాయని ఓయో వ్యవస్థాపకుడు, సీఈవో రితేష్ అగర్వాల్ ట్విటర్‌లో తెలిపారు. 2017 డిసెంబర్ తరువాత న్యూ ఇయర్ వీకెండ్‌లో ఈ స్థాయిలో బుకింగ్స్ జరగడం ఇదే తొలిసారి.2020 ఏప్రిల్ నుంచి 90 వారాల తరువాత అత్యధిక సంఖ్యలో బుకింగ్స్ జరిగాయని రితేష్ వెల్లడించారు.
ఒక్క రోజే 69 శాతం బుకింగ్స్..!
2016లో సుమారు 1.02 లక్షలకు పైగా బుకింగ్స్ జరగ్గా, 2021 డిసెంబర్ 30, 31 తేదీల్లో గరిష్టంగా 5.03 లక్షల ఓయో రూమ్స్ బుక్ అయ్యాయని అగర్వాల్ చెప్పారు. 2021 డిసెంబర్ 31 ఒక్క రోజే 69 శాతం రూమ్స్ బుక్ అవ్వగా...2020లో 61 శాతం, 2019లో 57 శాతం, 2018లో 63 శాతం , 2017లో 55 శాతంగా ఉన్నట్లు తెలిపారు.
127 నగరాల నుంచి 35 దేశాల్లో...
టెక్-ఆధారిత హాస్పిటాలిటీ సంస్థ ఓయో గణనీయమైన వృద్ధిని సాధించింది. కోవిడ్-19 రాకతో భారీ నష్టాలనే చవిచూసింది. ఆయా దేశాల్లో కరోనా ఉదృతి తగ్గడంతో పర్యాటక రంగం మెల్లమెల్లగా పుంజుకుంటూ వచ్చింది. ఈ ధోరణి ఓయోకు కలిసోచ్చింది. 2015లో కేవలం 127 నగరాల్లో మొదలవ్వగా అది ఇప్పడు 35 దేశాల్లో ఓయో తన సేవలను అందిస్తోంది.
చదవండి: Microsoft CEO Satya Nadella: న్యూ బిజినెస్..! న్యూ అవతార్..!
Comments
Please login to add a commentAdd a comment