Oyo Special Discount Scheme For Women Candidates Appearing For NEET Exam Test - Sakshi
Sakshi News home page

OYO: ఓయో బంపరాఫర్‌..విద్యార్థినులకు మాత్రమే!

Published Thu, Jul 14 2022 12:01 PM | Last Updated on Thu, Jul 14 2022 12:09 PM

 Oyo Special Discount Scheme For Women Candidates Appearing For Neet Exam Test - Sakshi

దేశీయ దిగ్గజ హాస్పిటాలిటీ సంస్థ ఓయో విద్యార్థినులకు భారీ ఆఫర్‌ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 497 నగరాలు, పట్టణాల్లో కలిపి నీట్‌ ఎగ్జామ్‌-2022ను 10లక్షల మంది విద్యార్ధులు రాయనున్నారు. ఈ తరుణంలో నీట్‌ ఎగ్జామ్‌ రాసే ప్రత్యేకంగా విద్యార్థినులకు ఓయో రూమ్స్‌ పై 60 శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. 

ప్రతి ఏడాది జరిగే నీట్‌ ఎగ్జామ్‌ కోసం పట్టణ,గ్రామాల విద్యార్ధినులు వ్యయ ప్రయాసలకు ఓర్చి కేంద్రానికి చేరుకోవాల్సి వస్తుంది. కొన్ని సార్లు నిమిషాల వ్యవధిలోనే పరీక్ష రాసేందుకు వీలులేక ఎగ్జామ్‌ సెంటర్‌ నుంచి నుంచి వెనుదిరిగిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. అందుకే ఈ ఏడాది జులై 17న (ఆదివారం) జరిగే నీట్‌ ఎగ్జామ్‌ రాయనున్న విద్యార్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా తక్కువ ప్రైస్‌లో విద్యార్ధినులకు ఓయో రూమ్స్‌ అందిస్తుంది. అందులో  వైఫై, ఎయిర్‌ కండీషనింగ్‌ సౌకర‍్యం కల్పిస్తున్నట్లు ఆ సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (కన్జ్యూమర్‌)  శ్రీరంగ్ గాడ్బోలే తెలిపారు.  
 
విద్యార్ధినులు ఓయో డిస్కౌంట్‌ పొందాలంటే!

ఓయో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయాలి

ఆ యాప్‌లో నియర్‌ బై ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి. 

ఆ ఆప్షన్‌పై ట్యాప్‌ చేస్తే ఎగ్జామ్‌ సెంటర్‌కు సమీపంలో ఉన్న ఓయో రూమ్స్‌ లిస్ట్‌ కనబడుతుంది. ఆ లిస్ట్‌లో మీకు కావాల్సిన ఓయో రూమ్స్‌ హోటల్‌ను సెలక్ట్‌ చేసుకొని 'నీట్‌ జేఎఫ్‌' కూపన్‌ కోడ్‌ను ఎంటర్‌ చేయాలి

ఆ తర్వాత బుక్‌ నౌ ఆప్షన్‌ క్లిక్‌ చేసి 40శాతం పేమెంట్ చేసి ఓయో రూంను వినియోగించుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement