
న్యూఢిల్లీ: ఆతిథ్య సేవల సంస్థ ‘ఓయో’ చైనాలోకి ప్రవేశించింది. విదేశాల్లో విస్తరణలో భాగంగా చైనాలోకి అడుగుపెట్టినట్లు ఓయో వ్యవస్థాపకుడు, సీఈఓ రితేశ్ అగర్వాల్ చెప్పారు. ఇప్పటికే మలేíసియా, నేపాల్‌లో విజయవంతంగా ప్రవేశించామని, చైనా తమకు మూడో దేశమని పేర్కొన్నారు. చైనాలోని 26 నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించామని వివరించారు. హాంగ్‌జూ, క్సియాన్, నాన్‌జింగ్, గాంగ్జూ, చెంగ్‌డు, షెన్‌జెన్, కున్‌మింగ్ తదితర నగరాల్లో ఓయో సేవలు లభిస్తాయి.