'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు' అన్న మాటలు అక్షర సత్యం. అయితే జీవితంలో ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలంటే తప్పకుండా కొంత మంది అనుభవాలు చాలా అవసరం. అవి తప్పకుండా మనిషిలో మంచి స్ఫూర్తిని నింపుతాయి. దీనికి నిదర్శనం మా అమ్మ చెప్పిన మాటలు అంటూ ఓయో సంస్థ సీఈఓ 'రితేశ్ అగర్వాల్' ఇటీవల వెల్లడించారు.
ఇటీవల ఐఐటీ నాగ్‌పూర్ గ్రాడ్యుయేషన్ వేడుకలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. వాళ్ళ అమ్మ చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నాడు. దీనికి సంబంధించి వీడియో కూడా ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇందులో నా అనుభవాలు, నేను నేర్చుకున్న పాఠాలను విద్యార్థులతో పంచుకునే అవకాశం ఇప్పుడు దక్కిందని ''మీరు గొప్పస్థాయికి చేరుకునే క్రమంలో, ఉన్నత శిఖరాలను అధిరోహించే మార్గంలో మీరు మీ మూలాలు ఎప్పటికీ మర్చిపోవద్దని, జీవితంలో ఎంత పైకి ఎదిగితే అంత ఒదిగి ఉండాలనే మాటను మా అమ్మ దగ్గర విన్నానని'' చెప్పాడు.
మీరు ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ, ఇంతకు ముందు ఎక్కడ ఉన్నారనే సంగతి మర్చిపోకూడదని అన్నారు. జీవితంలో గొప్ప వ్యాపారాలను సాధించాలనే తపనను విడనాడకుండా ఉన్న మాదిరిగానే మీ మూలాలను ఎప్పటికి విడిచిపెట్టకూడదన్నారు. ఈ వీడియో చూసిన చాలా మంది మీ మాటలతో ఏకీభవిస్తున్నామని.. మీ కథ అందరికీ ఆదర్శమని కామెంట్స్ పెటుతున్నారు.
(ఇదీ చదవండి: వైద్య వృత్తిలో వెయ్యికోట్లకంటే ఎక్కువ సంపాదిస్తున్న డాక్టర్ - ఈమె)
సుమారు రూ. 7,253 కోట్లకు అధిపతి అయిన ఓయో ఫౌండర్ రితేశ్ ఒడిశాలోని రాయ్‌గఢ్‌లో జన్మించాడు. కేవలం 19 సంవత్సరాల వయసులోనే హోటల్ వసతి కల్పించే ఓయో రూమ్స్ ప్రారభించి అతి తక్కువ కాలంలోనే విజయవంతమయ్యాడు. ప్రస్తుతం 'ఓయో'కున్న క్రేజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
“Jo ped sabse bade hote hain, woh sabse zyada jhuke huye hote hain.”
— Ritesh Agarwal (@riteshagar) April 18, 2023
(The more successful you become in life, the more rooted you should be.)
I recently got the opportunity to share some of my stories, experiences and lessons with the amazing students of @IIMNagpurIndia. This… pic.twitter.com/Dhs6BsD5Y7
తక్కువ వ్యవధిలోనే భారతదేశంలో బిలియనీర్‌గా ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన రితేశ్ అగర్వాల్ ఓయో సంస్థను 800 నరగరాలకు పైగా విస్తరించాడు. అంతే కాకుండా ఇప్పుడు ఆయన ఈ సంస్థను ఇతర దేశాలలో కూడా విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ సుమారు 1.1 బిలియన్ డాలర్లు.
Comments
Please login to add a commentAdd a comment