Ritesh Agarwal
-
సకుటుంబ ఇమేజ్ కోసం తహతహ: ఓయో
‘‘ఓకే అని అంటివా ఓయోకి రమ్మంటడు'’.. అంటూ ఓ సినీ రచయిత హీరోయిన్‌తో పలికిస్తాడు. ఆఖరికి సినీరచనలను సైతం ప్రభావితం చేసేలా మారిపోయింది. ఓయో బ్రాండ్ అనే దానికి ఇదో నిదర్శనం.అన్ మ్యారీడ్ కపుల్స్‌కి ఆహ్వానం..ఓయో అనే సంస్థ.. పలు హోటల్స్‌తో ఒప్పందాల ద్వారా దేశవ్యాప్తంగా బస సౌకర్యాలను విస్తరించడం ప్రారంభించిన సమయంలో ఈ పరిస్థితి లేదు. అయితే ఆ తర్వాత తర్వాత.. అన్ మ్యారీడ్ కపుల్ వెల్కమ్ అనే లైన్ ఎప్పుడైతే ఓయో యాప్ ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించిందో.. అప్పటి నుంచే ఆ యాప్ డౌన్‌లోడ్స్‌తో పాటు బ్రాండ్ వాల్యూ కూడా అమాంతం పెరిగిపోతూ వచ్చింది.ఈ నేపధ్యంలోనే అకస్మాత్తుగా ఓయో బ్రాండ్ ఇటీవల తన పంధాను సంస్కరించుకోవడం ప్రారంభించింది. పెళ్లికాని జంటలకు గదులు అద్దెకు ఇవ్వడం అనే విధానం నుంచి వెనక్కు మళ్లుతున్నట్టు కనిపిస్తోంది. పెళ్లికాని జంటలకు స్నేహపూర్వక విడిదిగా ప్రసిద్ది చెందిన ఈ బ్రాండ్ గత కొన్ని నెలలుగా సకుటుంబ - ఆధారిత ప్లాట్‌ఫారమ్‌గా ఓయోను రీబ్రాండ్ చేయడానికి కృషి చేస్తోంది.పెళ్లికాని జంటలకు సంబంధించి తన చెక్ - ఇన్ విధానాన్ని సవరించడం మీరట్‌లో ప్రారంభం కావడం మొదలు.. ఓయో హోటల్ సోషల్ మీడియాలో చర్చోపచర్చలకు దారి తీసింది. ఈ నేపధ్యంలోనే సంస్థ వ్యవస్థాపకుడు 'రితేష్ అగర్వాల్' మీడియాతో మాట్లాడారు. తమపై పడిన బ్రాండింగ్‌ను ఉద్దేశించి.. ఇది ఎక్కువగా మీమ్స్‌తో ముడిపడిన ’సోషల్ మీడియా సృష్టిగా ఆయన అభివర్ణించాడు.తమ వ్యాపారంలో దాదాపు 70 - 80% కుటుంబాలు లేదా వ్యాపార ప్రయాణీకుల నుంచే వస్తుందనీ.. అయినప్పటికీ, సోషల్ మీడియా కొన్ని మీమ్‌ల ద్వారా తమపై మరో తరహా అభిప్రాయానికి ఆజ్యం పోసిందనీ ఆయన చెప్పారు. అయితే ఇదంతా కేవలం నగరాల్లో అదీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమేనని తీసిపారేశారు. అయితే తాను ఓ రకంగా దీనిని అభినందిస్తున్నాననీ.. ఎందుకంటే ఇది (పెళ్లికాని జంటల బస) సమాజానికి కూడా ఒక సవాలుగా ఉంది కదా అన్నారాయన.తమ బ్రాండ్‌కు ఆథ్యాత్మిక ఇమేజ్ తేవడానికి కూడా ఆయన ప్రయత్నించినట్టు కనిపించింది. అయోధ్యలో 80 హోటళ్లను ప్రారంభించామనీ.. వారణాసి, రామేశ్వరం, అజ్మీర్ సహా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మికప్రదేశాలలో తాము భాగస్వాములను కలిగి ఉన్నామనీ ఆయన చెప్పుకొచ్చారు. తమ బ్రాండ్‌పై సోషల్ మీడియా మీమ్‌లు సృష్టించిన అపోహల గురించి గుసగుసలాడే బదులు, మా బ్రాండింగ్‌కి ఎదరువుతున్న సవాలును ధైర్యంగా నేరుగా ఎదుర్కొని పరిష్కరించాలనుకుంటున్నాం.. అన్నారాయన.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుతో అద్దె కడుతున్నారా.. ఈ విషయాలు తెలుసా?తమ కొత్త బ్రాండింగ్ వ్యూహం విజయవంతమైందని, గత మూడేళ్లలో కంపెనీ అత్యధిక యాప్ డౌన్లోడ్లు, రిపీట్ రేట్లు హోటల్ ఓపెనింగ్లను చూసిందన్నారు. మేం నిజంగా చాలా ప్రేమను పొందామని ఆయన పేర్కొన్నారు.సోషల్ మీడియాలో వచ్చిన మీమ్‌లు తనను ఇబ్బంది పెట్టాయా లేదా తన కంపెనీని ఎలా గుర్తించిందనే దాని గురించి బాధగా అనిపించిందా అని అడిగినప్పుడు.. అగర్వాల్ స్పందిస్తూ, అదేం లేదు, ఓయో.. కార్పొరేట్ ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన బ్రాండ్. ఇది అనేక ఉత్తమ కార్పొరేట్ అవార్డులను సాధించిందని ఆయన వెల్లడించారు. -
మీతో పంచుకోవాల్సిందే, రికమెండేషన్స్ ప్లీజ్..సీరియస్లీ: రితేష్ ఎమోషనల్
ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ తన జీవితంలోని ఒక గుడ్ న్యూస్ తన అభిమానులతో పంచుకున్నారు. తన భార్య గీతాన్షా సూద్ గర్భం దాల్చినట్టు ప్రకటించారు. ఈ ఏడాది మార్చిలో పెళ్లి చేసుకున్న రితేష్ సోషల్ మీడియాలో తాము తొలిసారి తల్లిదండ్రులు కాబోతున్నామన్న వార్తను పంచు కున్నారు. టీనేజర్‌గా, సొంత కంపెనీ పెట్టాలన్న కలలతో కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నాల్లో ఉండగా, 11 ఏళ్ల క్రితం గీత్‌ను కలిశాను. అలా టీనేజర్లుగా తరువాత జంటగా, ఇపుడు తల్లిదండ్రులుగా మారబోతున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఈ విషయాన్ని మీతో పంచుకునేందుక సంతోషిస్తున్నామంటూ ఈ శుభవార్తను అందించారు. రికమెండేషన్స్ ప్లీజ్..సీరియస్లీ అంతేకాదు న్యాపీలు, స్ట్రోలర్లు, బొమ్మల కోసం సిఫార్సులను షేర్ చేయాలంటూ అగర్వాల్ నెటిజన్లను కోరారు. మీరు ఏదైనా వినూత్నమైన స్టార్టప్ అయితే ఇంకా మంచిది. తీవ్రంగా, తండ్రి స్థాయి జ్ఞానం కోసం మార్కెట్లో ఉన్నానంటూ రాశారు. ఈ సందర్భంగా తన పోస్ట్‌లో తన భార్యపై ప్రశంసలు కురిపించారు కూడా.కష్టాలు,కన్నీళ్లు, సంతోషం అనేక మైలురాళ్ల ప్రయాణంలో తన వెనుక గట్టి నిలబడ్డ ఏకైక వ్యక్తి గీత్ అంటూ రాసుకొచ్చారు రితేష్ అగర్వాల్. దీంతో ఈ జంటకు ప్రశంసల వెల్లువ కురుస్తోంది. "ఓహ్! కంగ్రాట్స్!" అంటూ పాపులర్ రచయిత చేతన్ భగత్ వ్యాఖ్యానించారు.“ఆల్ ది బెస్ట్ రితేష్. పేరెంట్‌హుడ్ ఉత్తమమైనది, ” అని ఎడెల్వీస్ సీఎండీ రాధికా గుప్తా అభినందలు తెలిపారు.మార్చి 7న రితేష్ అగర్వాల్ గీతాన్షా సూద్ వివాహం చేసుకున్నారు. రితేష అగర్వాల్ 2013లో ఓయోను ప్రారంభించిన సంగతి తెలిసిందే. I met Geet eleven years ago, when I was just a teenager chasing dreams, trying to convince my family that I wanted to build my own company from scratch. There was only one constant who was by my side through it all, and it was her. The highs of happiness and milestones, the lows… pic.twitter.com/cJKY2xcXPF — Ritesh Agarwal (@riteshagar) October 13, 2023 -
ఆ పని చేసినందుకు రూ.20 టిప్పు ఇచ్చారు: ఓయో ఫౌండర్
కెరియర్ తొలినాళ్లలో తాను పడిన ఇబ్బందులు, ఎదురైన అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు ఓయో రూమ్స్ (OYO Rooms) ఫౌండర్ రితేష్ అగర్వాల్ (Ritesh Agarwal). కంపెనీకి బాస్‌గా మాత్రమే కాకుండా ఫ్రంట్ డెస్క్ మేనేజర్‌గా, అవసరమైనప్పుడు క్లీనింగ్ స్టాఫ్‌గా కూడా పనిచేసినట్లు వెల్లడించారు. అప్పుడు ఓయో ఇంకా ప్రారంభ దశలో ఉంది. రితేష్ అగర్వాల్ థీల్ ఫెలోషిప్ పూర్తి చేసుకుని అప్పుడే తిరిగివచ్చారు. ఈ సమయంలో తన సంస్థ అభివృద్ధికి ఆయన చాలా కష్టపడ్డారు. హోటల్ సిబ్బందిగా పనిచేశారు. కస్టమర్ కేర్, ఫ్రంట్ డెస్క్ మేనేజర్‌గా అవసరమైనప్పుడు క్లీనింగ్ పని కూడా చేశారు. బిజ్ టాక్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రితేష్ అగర్వాల్ హోటల్ గదిని శుభ్రం చేయడానికి వెళ్లిన సందర్భాన్ని వివరించారు. రూం క్లీనింగ్ ఆలస్యం కావడంతో ఓ కస్టమర్ చాలా కోపంగా ఉన్నాడు. అతనికి సర్దిచెప్పడానికి వెళ్లిన రితేష్ అగర్వాల్‌ను క్లీనింగ్ సిబ్బందిగా భావించి ఆ కస్టమర్ ఎడాపెడా తిట్టేశాడు. చివరికి రితేష్ అగర్వాల్ స్వయంగా ఆ గదిని శుభ్రం చేశాడు. దీంతో సంతృప్తి చెందిన కస్టమర్ తనకు రూ. 20 టిప్ ఇచ్చాడని రితేష్ అగర్వాల్ గుర్తు చేసుకున్నారు. హాస్పెటాలిటీ రంగంలో హౌస్కీపర్లు, డెస్క్ మేనేజర్లు వంటి సిబ్బంది పాత్రను, గొప్పతనాన్ని వివరిస్తూ తొలినాళ్లలో తనకు ఎదురైన అభువాన్ని వెల్లడించిన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ట్విటర్లో షేర్ చేశారు రితేష్ అగర్వాల్. హాస్పిటాలిటీ పరిశ్రమలో నిజమైన తారలు ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్లు, క్లీనింగ్ సిబ్బంది, రిసెప్షనిస్ట్‌లు, తెరవెనుక సిబ్బంది అంటూ అందులో రాసుకొచ్చారు. The real stars of the hospitality industry are the front office managers, cleaning crew, receptionists and behind-the-scenes staff who ensure guests have the best possible experience during their stay. Early on I got to experience this first-hand when a customer tipped me Rs… pic.twitter.com/M1Gre6NTUh — Ritesh Agarwal (@riteshagar) May 28, 2023 ఇదీ చదవండి: Prerna Jhunjhunwala: రూ. 330 కోట్ల యాప్.. ఈమె స్టార్టప్ పిల్లల కోసమే.. -
జీవితంలో ఎదగాలంటే? ఓయో ఫౌండర్ 'రితేశ్ అగర్వాల్' మాటల్లో..
'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు' అన్న మాటలు అక్షర సత్యం. అయితే జీవితంలో ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలంటే తప్పకుండా కొంత మంది అనుభవాలు చాలా అవసరం. అవి తప్పకుండా మనిషిలో మంచి స్ఫూర్తిని నింపుతాయి. దీనికి నిదర్శనం మా అమ్మ చెప్పిన మాటలు అంటూ ఓయో సంస్థ సీఈఓ 'రితేశ్ అగర్వాల్' ఇటీవల వెల్లడించారు. ఇటీవల ఐఐటీ నాగ్‌పూర్ గ్రాడ్యుయేషన్ వేడుకలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. వాళ్ళ అమ్మ చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నాడు. దీనికి సంబంధించి వీడియో కూడా ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇందులో నా అనుభవాలు, నేను నేర్చుకున్న పాఠాలను విద్యార్థులతో పంచుకునే అవకాశం ఇప్పుడు దక్కిందని ''మీరు గొప్పస్థాయికి చేరుకునే క్రమంలో, ఉన్నత శిఖరాలను అధిరోహించే మార్గంలో మీరు మీ మూలాలు ఎప్పటికీ మర్చిపోవద్దని, జీవితంలో ఎంత పైకి ఎదిగితే అంత ఒదిగి ఉండాలనే మాటను మా అమ్మ దగ్గర విన్నానని'' చెప్పాడు. మీరు ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ, ఇంతకు ముందు ఎక్కడ ఉన్నారనే సంగతి మర్చిపోకూడదని అన్నారు. జీవితంలో గొప్ప వ్యాపారాలను సాధించాలనే తపనను విడనాడకుండా ఉన్న మాదిరిగానే మీ మూలాలను ఎప్పటికి విడిచిపెట్టకూడదన్నారు. ఈ వీడియో చూసిన చాలా మంది మీ మాటలతో ఏకీభవిస్తున్నామని.. మీ కథ అందరికీ ఆదర్శమని కామెంట్స్ పెటుతున్నారు. (ఇదీ చదవండి: వైద్య వృత్తిలో వెయ్యికోట్లకంటే ఎక్కువ సంపాదిస్తున్న డాక్టర్ - ఈమె) సుమారు రూ. 7,253 కోట్లకు అధిపతి అయిన ఓయో ఫౌండర్ రితేశ్ ఒడిశాలోని రాయ్‌గఢ్‌లో జన్మించాడు. కేవలం 19 సంవత్సరాల వయసులోనే హోటల్ వసతి కల్పించే ఓయో రూమ్స్ ప్రారభించి అతి తక్కువ కాలంలోనే విజయవంతమయ్యాడు. ప్రస్తుతం 'ఓయో'కున్న క్రేజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. “Jo ped sabse bade hote hain, woh sabse zyada jhuke huye hote hain.” (The more successful you become in life, the more rooted you should be.) I recently got the opportunity to share some of my stories, experiences and lessons with the amazing students of @IIMNagpurIndia. This… pic.twitter.com/Dhs6BsD5Y7 — Ritesh Agarwal (@riteshagar) April 18, 2023 తక్కువ వ్యవధిలోనే భారతదేశంలో బిలియనీర్‌గా ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన రితేశ్ అగర్వాల్ ఓయో సంస్థను 800 నరగరాలకు పైగా విస్తరించాడు. అంతే కాకుండా ఇప్పుడు ఆయన ఈ సంస్థను ఇతర దేశాలలో కూడా విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ సుమారు 1.1 బిలియన్ డాలర్లు. -
ఐపీవోకి ఓయో..సమీకరణ లక్ష్యం ఎన్ని వేలకోట్లంటే?
ఓయో పేరిట ఆతిథ్య సేవలను అందిస్తోన్న ఒరావెల్ స్టేస్ లిమిటెడ్ ఐపీఓకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓయో సీఈవో రితిష్ అగర్వాల్ మాట్లాడుతూ ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ నెలలో లిస్టింగ్‌కు వెళ్లే యోచనలో ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకుల నేపథ్యంలో ఐపీఓ విషయంలో ఓయో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈసారి ఆఫర్ ఫర్ సేల్ కింద ఎలాంటి షేర్లను విక్రయించబోదని తెలుస్తోంది. రూ.8,430 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఓయో 2021లోనే ఐపీఓకి దరఖాస్తు చేసుకుంది. కానీ, వివిధ కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఓయో ఐపీవోకి ఫైల్ చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలపై మాట్లాడేందుకు ఓయో అధికార ప్రతినిధులు విముఖత వ్యక్తం చేశారు. -
నిన్నగాక మొన్న పెళ్లి: ఓయో ఫౌండర్ ఇంట తీవ్ర విషాదం
న్యూఢిల్లీ: ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. నిన్నగాక మొన్న రితేష్ అగర్వాల్ వివాహం వైభవంగా జరిగింది. కుటుంబమంతా ఈ సంతోషంలో ఉండగానే రితేష్ తండ్రి రమేష్ అగర్వాల్ దుర్మరణం విషాదాన్ని నింపింది. ఈ విషాద వార్తను రితేష్ స్వయంగా వెల్లడించారు. “మా కుటుంబం, నేను బరువైన హృదయంతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. మా తండ్రి రమేష్ అగర్వాల్ (మార్చి 10 శుక్రవారం) మరణించారు. నిండైన జీవితాన్ని గడిపిన ఆయన నాతోపాటు మనలో చాలామందికి స్ఫూర్తి. ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటు. ఆయన స్ఫూర్తి ఎల్లపుడూ మా వెన్నంటే ఉంటుంది. ఈ దుఃఖ సమయంలో ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలని కోరుతున్నాం’’ అంటూ రితేష్ అగర్వాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఎత్తైన భవనంపై నుండి రమేష్ పడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. గురుగ్రామ్‌లోని సెక్టార్ 54లో DLF ది క్రెస్ట్ సొసైటీ 20వ అంతస్తు నుండి పడిపోయారని సెక్యూరిటీ పోలీసులకు సమాచారం అంచారు. సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. పోస్ట్‌మార్టమ్ అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా రితేష్ అగర్వాల్ ఫార్మేషన్ వెంచర్స్ డైరెక్టర్ గీతాన్షా సూద్‌ను న్యూఢిల్లీలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్లో ఇచ్చిన రిసెప్షన్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ సీఈఓ మసయోషి సన్తో సహా పరిశ్రమ ప్రముఖులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. -
రితేష్ అగర్వాల్ భార్య కూడా వ్యాపారవేత్తేనా?
ఓయో (Oyo) వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ (Ritesh Agarwal) వివాహం గీతన్షా సూద్ (Geetansha Sood)తో ఇటీవల ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. సాఫ్ట్‌బ్యాంక్ చీఫ్ మసోయోషి సన్, భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ, లెన్స్‌కార్ట్ సీఈవో పెయుష్ బన్సాల్, ఫ్లిప్‌కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి తదితర ప్రముఖులందరూ హాజరయ్యారు. ఇదీ చదవండి: Flipkart Big Saving Days sale: మళ్లీ ఆఫర్లు.. ఖరీదైన ఫోన్లపై భారీ డిస్కౌంట్లు! రితేష్ అగర్వాల్ సతీమణి గీతన్షా సూద్ ఎవరు? ఆమె కూడా వ్యాపారవేత్తేనా? అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తోంది. ఇంతకూ ఆమె ఎవరు.. ఆమెకు ఏవైనా వ్యాపార సంస్థలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ఎవరీ గీతన్షా సూద్? గీతన్షా సూద్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో వాసి. ఫార్మేషన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఆమె డైరెక్టర్‌గా ఉన్నారని తెలిసింది. మై కార్పొరేట్ ఇన్ఫో ప్రకారం.. ఈ కంపెనీ కాన్పూర్‌లో రిజిస్టర్ అయింది. 2020 ఆగస్ట్ 22న కాన్పూర్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో నమోదైంది. రూ. లక్ష అధీకృత మూలధనం, మరో రూ. లక్ష చెల్లించిన మూలధనం కలిగి ఉంది. ఈ కంపెనీకి ఆమెతోపాటు కుహూక్ సూద్ అనే మరో డైరెక్టర్ ఉన్నారు. -
ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ పెళ్లిలో ఆసక్తికర ఘటన!
ఆతిథ్యం, ప్రయాణ సేవల(ట్రావెల్ టెక్) కంపెనీ ఓయో అధినేత రితేష్ అగర్వాల్ (Ritesh Agarwal) వివాహం ఘనంగా జరిగింది. రితేశ్ అగర్వాల్- గీతాన్షా దంపతుల వివాహానికి సాఫ్ట్‌బ్యాంక్ చైర్మన్ మసయోషి సన్ హాజరయ్యారు. మసయోషితో పాటు ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ, లెన్స్ కార్ట్ సీఈవో పియోష్ బన్సాల్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రితేష్ అగర్వాల్ దంపతులు సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ మసయోషి సన్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం దేశీయ కార్పొరేట్ వరల్డ్‌లో ఆసక్తికరంగా మారింది. ఇక మసయోషి పర్యటనపై విజయ్ శేఖర్ శర్మ ట్వీట్ చేశారు. ఈ రోజు వెలకట్టలేని ఆనందం. మస నవ్వుతూ, సంతోషంగా ఉన్న ఈ ఆనంద సమయాల్లో భారత పర్యటన చేయడం..దేశీయ స్టార్టప్‌లపై అతనికి ఉన్న నమ్మకం, సపోర్ట్‌కు కృతజ్ఞతలు అంటూ మసయోషితో దిగిన ఫోటోల్ని ట్వీట్ చేశారు. కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సైతం పెళ్లికి హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. Ultimate joy today, seeing Masa smiling, happy and enjoying his India trip. Everyone of us had tons of gratitude for his belief and support given to our Startups. pic.twitter.com/pt33w0AwyE — Vijay Shekhar Sharma (@vijayshekhar) March 7, 2023 గత వారం తన వివాహ వేడుక ఆహ్వాన పత్రికను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేశారు. ఢిల్లీలో తన తల్లి, కాబోయే భార్యతో కలిసి మోదీ వద్దకు వెళ్లిన రితేశ్.. ప్రధానికి పెళ్లి ఆహ్వానపత్రిక అందజేసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆ ఫోటోలను రితేష్ అగర్వాల్ ట్విటర్లో షేర్ చేశారు.