ఓయో (Oyo) వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ (Ritesh Agarwal) వివాహం గీతన్షా సూద్ (Geetansha Sood)తో ఇటీవల ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. సాఫ్ట్‌బ్యాంక్ చీఫ్ మసోయోషి సన్, భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ, లెన్స్‌కార్ట్ సీఈవో పెయుష్ బన్సాల్, ఫ్లిప్‌కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి తదితర ప్రముఖులందరూ హాజరయ్యారు.
ఇదీ చదవండి: Flipkart Big Saving Days sale: మళ్లీ ఆఫర్లు.. ఖరీదైన ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
రితేష్ అగర్వాల్ సతీమణి గీతన్షా సూద్ ఎవరు? ఆమె కూడా వ్యాపారవేత్తేనా? అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తోంది. ఇంతకూ ఆమె ఎవరు.. ఆమెకు ఏవైనా వ్యాపార సంస్థలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు.
ఎవరీ గీతన్షా సూద్?
గీతన్షా సూద్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో వాసి. ఫార్మేషన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఆమె డైరెక్టర్‌గా ఉన్నారని తెలిసింది. మై కార్పొరేట్ ఇన్‌ఫో ప్రకారం.. ఈ కంపెనీ కాన్పూర్‌లో రిజిస్టర్ అయింది. 2020 ఆగస్ట్ 22న కాన్పూర్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో నమోదైంది. రూ. లక్ష అధీకృత మూలధనం, మరో రూ. లక్ష చెల్లించిన మూలధనం కలిగి ఉంది. ఈ కంపెనీకి ఆమెతోపాటు కుహూక్ సూద్ అనే మరో డైరెక్టర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment