న్యూఢిల్లీ: ఆతిథ్యం, ట్రావెల్ టెక్ కంపెనీ ఒరావెల్ స్టేస్ లిమిటెడ్ ఈ క్యాలండర్ ఏడాది చివరి త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. సెప్టెంబర్ తదుపరి ఐపీవోకు వెళ్లే ప్రణాళికల్లో ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా తాజాగా సవరించిన కన్సాలిడేటెడ్ ఆర్థిక ఫలితాల సమాచారాన్ని సెబీకి దాఖలు చేసింది.
ఓయో బ్రాండ్ కంపెనీ గతేడాది అక్టోబర్‌లో షేర్ల విక్రయం ద్వారా రూ. 8,430 కోట్ల సమీకరణకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక పత్రాలను సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే తొలుత 11 బిలియన్ డాలర్ల విలువను లక్ష్యంగా పెట్టుకున్న కంపెనీ ఇటీవల 7–8 బిలియన్ డాలర్లకు లక్ష్యాన్ని సవరించుకున్నట్లు తెలుస్తోంది.
ఆర్థిక పనితీరులో మెరుగుపడే అవకాశం, మార్కెట్లలో ప్రస్తుతం నమోదవుతున్న హెచ్చుతగ్గులు వంటి అంశాలు క్యూ4లో ఐపీవో చేపట్టే యోచనకు కారణాలుగా సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment