ఓయో పేరిట ఆతిథ్య సేవలను అందిస్తోన్న ఒరావెల్ స్టేస్ లిమిటెడ్ ఐపీఓకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓయో సీఈవో రితిష్ అగర్వాల్ మాట్లాడుతూ ఈ ఏడాది అక‍్టోబర్ - నవంబర్ నెలలో లిస్టింగ్‌కు వెళ్లే యోచనలో ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
మరోవైపు ప్రస్తుతం మార్కెట్‌లో నెలకొన్న ఒడిదుడుకుల నేపథ్యంలో ఐపీఓ విషయంలో ఓయో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈసారి ఆఫర్ ఫర్ సేల్ కింద ఎలాంటి షేర్లను విక్రయించబోదని తెలుస్తోంది. రూ.8,430 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఓయో 2021లోనే ఐపీఓకి దరఖాస్తు చేసుకుంది.
కానీ, వివిధ కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఓయో ఐపీవోకి ఫైల్ చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలపై మాట్లాడేందుకు ఓయో అధికార ప్రతినిధులు విముఖత వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment