సాక్షి,ముంబై: ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు మేక్మై ట్రిప్, గోఐబిబో, ఓయోలకు భారీ షాక్ తగిలింది. యాంటీ కాంపిటీటివ్, అక్రమ విధానాలకు పాల్పడుతున్నారంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)భారీ జరిమానా విధించింది. ఏకంగా రూ.392 కోట్ల మేర ఫైన్ విధిస్తూ బుధవారం సీసీఐ ప్రకటించిన నిర్ణయం వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది. (జోయాలుక్కాస్‌లో దీపావళి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు)
హోటల్ విభాగంలో అన్యాయమైన వ్యాపార విధానాలకు పాల్పడినందుకు మేక్ మై ట్రిప్-గోఇబిబో. రూ. 223.48 కోట్లు, ఓయోకు రూ. 168.88 కోట్ల నగదు జరిమానాలు విధించింది. ఈ మేరకు సీసీఐ 131 పేజీల ఆర్డర్‌ను జారిచేసింది. పలు హోటళ్లు, రెస్టారెంట్లతో ఈ ఏజెన్సీల అక్రమ ఒప్పందాలు మార్కెట్‌లో పోటీని దెబ్బ తీసేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ ధోరణి వినియోదారుల హక్కుల్ని దెబ్బతీయడం తోపాటు, గుత్తాధిపత్యానికి తెర తీస్తుందని సీసీఐ చురకలేసింది. అంతేకాదు తమ ద్వారా బుక్ చేసుకున్న ధర కంటే తక్కువకు ఇతరులకు గదులను కేటాయించకుండా ఆంక్షలు విధించడంపై మండిపడింది. తక్షణమే దీన్ని సవరించుకోవాలని, ముఖ్యంగా, ధర, గది లభ్యతపై హోటళ్లు/గొలుసు హోటళ్లతో ఉన్న ఒప్పందాలను రద్ద చేసుకోవాలని కూడా ఆదేశించింది. ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీల మీద ఇంత భారీ మొత్తంలో ఫైన్ విధించడం ఇదే తొలిసారి. (ముందస్తు దీపావళి కాంతులు: ఐటీ ఉద్యోగులకు తీపి కబురు)
నాస్డాక్-లిస్టెడ్ ఎంఎంటీ తన ప్లాట్‌ఫారమ్‌లో ఓయోకి అనుకూలంగా వ్యవహరిస్తోందని తేలిందని సీసీఐ ఆరోపించింది. ఇది ఇతర సంస్థ వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీస్తుందని తెలిపింది. ఓయో, మేక్‌మైట్రిప్‌ల మధ్య ఒప్పందాలు ఉన్నాయని, దీని కారణంగానే వారు తమ ప్లాట్‌ఫారమ్‌లో ఓయోకు ప్రాధాన్యతనిస్తూ, ఇతర సంస్థలను దెబ్బ తీస్తున్నాయని ఫెడరేషన్ ఆఫ్ హోటల్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా విమర్శించింది. కాగా మేక్‌మై ట్రిప్‌ను 2000 సంవత్సరంలో దీప్ కల్రా స్థాపించారు. 2017లో, ఎంఎటీ ఐబిబో గ్రూప్ హోల్డింగ్‌ని స్వాధీనం చేసుకుంది. అప్పటినుంచి మేక్ మై ట్రిప్ బ్రాండ్ పేరుతో తన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment