travel agencies
-
పండగ వేళ ఓయో, మేక్‌మై ట్రిప్‌లకు సీసీఐ భారీ షాక్
సాక్షి,ముంబై: ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు మేక్‌మై ట్రిప్, గోఐబిబో, ఓయోలకు భారీ షాక్ తగిలింది. యాంటీ కాంపిటీటివ్, అక్రమ విధానాలకు పాల్పడుతున్నారంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)భారీ జరిమానా విధించింది. ఏకంగా రూ.392 కోట్ల మేర ఫైన్ విధిస్తూ బుధవారం సీసీఐ ప్రకటించిన నిర్ణయం వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది. (జోయాలుక్కాస్‌లో దీపావళి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు) హోటల్ విభాగంలో అన్యాయమైన వ్యాపార విధానాలకు పాల్పడినందుకు మేక్ మై ట్రిప్-గోఇబిబో. రూ. 223.48 కోట్లు, ఓయోకు రూ. 168.88 కోట్ల నగదు జరిమానాలు విధించింది. ఈ మేరకు సీసీఐ 131 పేజీల ఆర్డర్‌ను జారిచేసింది. పలు హోటళ్లు, రెస్టారెంట్లతో ఈ ఏజెన్సీల అక్రమ ఒప్పందాలు మార్కెట్లో పోటీని దెబ్బ తీసేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ ధోరణి వినియోదారుల హక్కుల్ని దెబ్బతీయడం తోపాటు, గుత్తాధిపత్యానికి తెర తీస్తుందని సీసీఐ చురకలేసింది. అంతేకాదు తమ ద్వారా బుక్ చేసుకున్న ధర కంటే తక్కువకు ఇతరులకు గదులను కేటాయించకుండా ఆంక్షలు విధించడంపై మండిపడింది. తక్షణమే దీన్ని సవరించుకోవాలని, ముఖ్యంగా, ధర, గది లభ్యతపై హోటళ్లు/గొలుసు హోటళ్లతో ఉన్న ఒప్పందాలను రద్ద చేసుకోవాలని కూడా ఆదేశించింది. ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీల మీద ఇంత భారీ మొత్తంలో ఫైన్ విధించడం ఇదే తొలిసారి. (ముందస్తు దీపావళి కాంతులు: ఐటీ ఉద్యోగులకు తీపి కబురు) నాస్డాక్-లిస్టెడ్ ఎంఎంటీ తన ప్లాట్‌ఫారమ్‌లో ఓయోకి అనుకూలంగా వ్యవహరిస్తోందని తేలిందని సీసీఐ ఆరోపించింది. ఇది ఇతర సంస్థ వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీస్తుందని తెలిపింది. ఓయో, మేక్‌మైట్రిప్‌ల మధ్య ఒప్పందాలు ఉన్నాయని, దీని కారణంగానే వారు తమ ప్లాట్‌ఫారమ్‌లో ఓయోకు ప్రాధాన్యతనిస్తూ, ఇతర సంస్థలను దెబ్బ తీస్తున్నాయని ఫెడరేషన్ ఆఫ్ హోటల్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా విమర్శించింది. కాగా మేక్‌మై ట్రిప్‌ను 2000 సంవత్సరంలో దీప్ కల్రా స్థాపించారు. 2017లో, ఎంఎటీ ఐబిబో గ్రూప్ హోల్డింగ్‌ని స్వాధీనం చేసుకుంది. అప్పటినుంచి మేక్ మై ట్రిప్ బ్రాండ్ పేరుతో తన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. -
హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్.. సారీ చెప్పిన ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ
హైదరాబాద్ నగరం పేరును భాగ్యనగర్ మార్చాలంటూ వస్తున్న డిమాండ్లు ఇప్పటికే వివాస్పదం కాగా ఇందులో వేలు పెట్టిన ఓ ట్రావెల్ ఏజెన్సీ సంస్థ చిక్కుల్లో పడింది. ఇష్టారీతిగ నగర పేర్లు మార్చేందుకు మీరెవరు అంటూ నెటిజన్లు దండెత్తడంతో సారీ చెప్పింది. స్టార్టప్‌గా మొదలై యూనికార్న్ దిశగా పరుగులు పెడుతోంది ట్రావెల్ యాప్ ఇక్సిగో. బస్సులు, రైళ్లు, విమాన టిక్కెట్లు ఈ యాప్‌లో బుక్ చేసుకోవచ్చు. నాలుగేళ్ల కిందట వచ్చిన ఈ యాప్ అనేక మంది యూజర్ల అభిమానాన్ని సంపాదించుకుంది. తాజాగా హైదరాబాద్‌కి చెందిన ఓ నెటిజన్ ఇక్సిగో వెబ్సైట్లో భాగ్యనగర్ అని టైప్ చేయగా రాజీవ్‌గాంధీ ఇంటర్నెషన్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ అంటూ స్క్రీన్‌పై ప్రత్యక్షం అయ్యింది. హైదరాబాద్ నగరం పేరును భాగ్యనగర్ మార్చాలంటూ వస్తున్న డిమాండ్లు ఇప్పటికే వివాస్పదం కాగా ఇందులో వేలు పెట్టిన ఓ ట్రావెల్ ఏజెన్సీ సంస్థ చిక్కుల్లో పడింది. ఇష్టారీతిగ నగర పేర్లు మార్చేందుకు మీరెవరు అంటూ నెటిజన్లు దండెత్తడంతో సారీ చెప్పింది. Hey @ixigo who the hell gave you the right to change Hyderabad's name to Bhagyanagar? I type in Bhagyanagar and it shows RGIA.What the hell? Absolutely not okay. Ridiculous. So tomorrow if someone calls a city Fart Nagar will you do that too? Hyderabadis should #boycottixigo pic.twitter.com/Nfvi2BrPqt — Yunus Lasania (@lasaniayunus) January 14, 2022 భాగ్యనగర్ అని టైప్ చేస్తే హైదరాబాద్ ఎయిర్‌పోర్టును చూపించడంపై నెటిజన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సదరు స్క్రీన్‌షాట్‌ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. రేపు ఎవరో వచ్చి ఇంకేదో పేరు పెట్టాలంటూ డిమాండ్ చేస్తే ఇలాగే చేస్తారా అంటూ ప్రశ్నించారు. క్షణాల్లో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఇక్సిగో చేసిన పనిపై నెటిజన్లు మండిపడ్డారు. బాయ్‌కాట్ ఇక్సిగో అంటూ ట్రెండ్ చేశారు. నెటిజన్ల ఆగ్రహంతో ఇక్సిగో వివరణ ఇచ్చింది. భాగ్యనగర్ అని టైప్ చేస్తే హైదరాబాద్ అని చూపించడం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, టెక్నికల్ ఎర్రర్స్ వల్ల అలా జరిగిందని తెలిపింది. జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పింది. Hey @ixigo who the hell gave you the right to change Hyderabad's name to Bhagyanagar? I type in Bhagyanagar and it shows RGIA.What the hell? Absolutely not okay. Ridiculous. So tomorrow if someone calls a city Fart Nagar will you do that too? Hyderabadis should #boycottixigo pic.twitter.com/Nfvi2BrPqt — Yunus Lasania (@lasaniayunus) January 14, 2022 -
జమ్ముకశ్మీర్‌లో చిక్కుకున్న 120 మంది సిక్కోలు యాత్రికులు
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం నుంచి సింధు పుష్కరాలకు వెళ్లిన జిల్లా వాసులకు చేదు అనుభవం ఎదురైంది. మైసూర్‌కు చెందిన అకుల్ ట్రావెల్స్ ఏజెన్సీ ప్రతినిధులు.. శ్రీకాకుళం స్థానికులను టూరిజం పేరుతో యాత్రకు తీసుకెళ్లారు. ఒక్కొ కపుల్ నుంచి 60 వేలను ట్రావెల్ సిబ్బంది వసూలుచేశారు. ఈ క్రమంలో 120 మంది యాత్రికులు జమ్ముకశ్మీర్‌లోని కట్రా వద్ద హోటల్‌కి చేరుకున్నారు. ఆ తర్వాత.. ట్రావెల్ సిబ్బంది యాత్రికులను అక్కడ వదిలేసి పరారయ్యారు. దీంతో హోటల్ వారు డబ్బులు కట్టాలని 120 మంది యాత్రికులు నిర్భందించారు. ప్రతి ఒక్కరు.. తలా పదివేలు కట్టాలంటూ యాత్రికులను హోటల్ సిబ్బంది డిమాండ్ చేశారు. దీంతో యాత్రికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యాత్రికులలో ఎక్కువగా.. పాలకొండ, నరసన్నపేట గ్రామానికి చెందిన వారున్నట్లు అధికారులు తెలిపారు. -
విదేశాలు వెళుతున్నారా... ట్రావెల్ కార్డ్ బెటర్!
విదేశీ పర్యటనలు చేయాలని ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు కూడా సరదాపడుతున్నారు. ఆదాయాలు పెరగడం కోరికలకు కూడా రెక్కలు వస్తున్నాయి. విదేశీ పర్యటనను ఏదో ఒక సరదా అంశంగా కాకుండా... విజ్ఞానాన్ని, మనో వికాసాన్ని పెంపొందించే ఒక అవకాశంగా కూడా ప్రజలు చూడ్డం ప్రారంభించారు. ఇందుకోసమే ప్రతినెలా కొంత డబ్బును తీసి పక్కనబెట్టే రోజులు వచ్చాయి. ప్రత్యేకించి నగరాల్లో నివసిస్తున్న కుటుంబాల్లో విదేశీ పర్యటన మోజు తీవ్రమవుతోంది. ‘పర్యటన ఎప్పుడో ఒకసారి’ అనే ధోరణికి బదులు ‘ఏడాదికి ఒకసారి తప్పనిసరి’గా మారింది. రంగంలోకి ట్రావెల్ కంపెనీలు... ప్రజల్లో వ్యక్తమవుతున్న విదేశీ పర్యటన ఆసక్తిని, ఉత్సాహాన్ని వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి, దీనిని ఒక వ్యాపార అవకాశంగా మలచుకోడానికి పలు ట్రావెల్ కంపెనీలు కూడా పుట్టుకువచ్చాయి. ఎటువంటి పరిమితులూ లేకుండా... ఎప్పుడు కావాలంటే అప్పుడు... ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి యాత్రికుల ఆర్థిక శక్తికొలదీ వారికి విదేశీ పర్యటన అనుభవాన్ని ట్రావెల్ కంపెనీలు ఇస్తున్నాయి. గ్రూప్ ట్రావెల్స్, రాయితీలు వంటి పలు ఆకర్షణీయమైన పథకాలను ట్రావెల్ ఏజెన్సీలు ప్రవేశపెడుతున్నాయి. ప్రపంచంలోని మెజారిటీ దేశాలు సైతం పర్యాటక రంగానికి ప్రాధాన్యతను ఇస్తూ.. పర్యాటకులను ఆకర్షించడానికి పలు చర్యలు తీసుకుంటున్నాయి. ‘ఇంటర్నెట్’ ద్వారా పర్యాటకులు తమకు కావల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. పర్యాటక ప్రాంతాలు, హోమ్ స్టే, హోటల్స్ వంటి వివరాలను పర్యాటకులకు వెబ్సైట్లు అందుబాటులో ఉంచుతున్నాయి. లోకల్ కరెన్సీతోనే ఎంజాయ్... మీరు ఒక వేరే దేశంలో అడుగుపెట్టారంటే... అక్కడ ఉత్సాహంగా గడపడానికి లోకల్ కరెన్సీ తప్పనిసరి. ఈ విషయంలో ఇటీవల ‘ట్రావెల్ కార్డులు’ ప్రజాదరణ సంపాదించుకుంటున్నాయి. మీకు ఎంతకావాలో అంత మొత్తం ఆ దేశ లోకల్ కరెన్సీని అందించడానికి ఈ కార్డులు చక్కని సాధనాలుగా మారాయి. వీటి విశేషాలను చూస్తే... ►బ్యాంకులు వీటిని ఆఫర్ చేస్తాయి. మీరు ఏ దేశానికి వెళుతున్నారో ఆ దేశ కరెన్సీని ‘మీరు కోరినంత పరిమాణంతో’ ప్రస్తుత విదేశీ మారకపు విలువను లోడ్‌చేసి ట్రావెల్ కార్డ్‌ను అందజేస్తారు. అంటే ఇవి ప్రీ-పెయిడ్ కార్డులన్నమాట. విదేశీ ఏటీఎంల నుంచి ప్రత్యక్షంగా ఈ కార్డుల ద్వారా మీరు స్థానిక కరెన్సీని విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. షాపింగ్‌కు మర్చంట్ పాయింట్-ఆఫ్-సేల్ వద్ద కూడా ఈ కార్డును ప్రత్యక్షంగా వినియోగించుకోవచ్చు. ►ట్రావెలర్ చెక్కులకు ప్రజాదరణ రోజురోజుకు తగ్గుతున్న నేపథ్యం- దురదృష్టవశాత్తు ఒక్కొక్కసారి నగదు కోల్పోయి ఇబ్బంది పడే అవకాశాలు తలెత్తకుండా చూసుకోవడం వంటి అంశాలకు ‘ట్రావెల్ కార్డ్’ ఒక చక్కని సమాధానం. ►ఒకసారి పర్యటన పూర్తయిన తర్వాత, ఖర్చుకాని డబ్బుకు సంబంధించి రిఫండ్ సైతం ఎంతో తేలిక. అవసరమైతే అదే కార్డును విదేశాల్లో మరో ట్రిప్‌కు కూడా వినియోగించుకునే సౌలభ్యం ఉంది. ►వివిధ దేశాల్లో ఒకేసారి సుదీర్ఘకాలం పర్యటించే సమయాలకు సంబంధించి ‘మల్టీ కరెన్సీ ట్రావెల్ కార్డు’కూడా అందుబాటులో ఉంటుంది. ►ఈ కార్డులకు భద్రతా పరమైన అంశాలు ప్రత్యేకమైనవి. బ్యాంకులు అందించే సెల్ఫ్-కేర్ పోర్టల్, నిరంతర ఇంటర్నేషనల్ టోల్ ఫ్రీ నంబర్ కస్టమర్లకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. బ్యాలెన్స్ ఎంత ఉంది? ఒకవేళ కార్డును పోగొట్టుకుంటే... దానిని బ్లాక్‌చేసి, అందులో ఉన్న డబ్బును వేరొక కార్డు (రిప్లేస్మెంట్ కార్డ్)కు బదలాయించడం వంటి సౌలభ్యతలు ఇక్కడ లభిస్తాయి. ప్రైమరీ కార్డు సమయంలోనే అదనంగా మరో రిప్లేస్మెంట్ కార్డును అందజేయడం జరుగుతుంది. ►కార్డును మీరు వినియోగించినప్పుడల్లా... అందుకు సంబంధించిన సమాచారం ఎస్ఎంఎస్, ఈ మెయిల్ అలర్ట్ రూపంలో ఈ అంశాన్ని తెలియజేస్తుంది. తద్వారా కార్డు వినియోగ సమాచారం మీకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది. వేరొక వ్యక్తి సదరు కార్డు నంబర్ దుర్వినియోగానికే ఇక్కడ ఆస్కారం ఉండదు. ఇంకా చెప్పాలంటే... ఉన్నత స్థాయి భద్రతా ప్రమాణాలతో కార్డులు ఇప్పుడు చిప్ అండ్ పిన్ టెక్నాలజీతో సైతం అందుబాటులోకి వస్తున్నాయి. ►విమాన ప్రమాదాల్లో మరణం, వీసా అలాగే పాస్‌పోర్ట్ వంటి ట్రావెల్ డాక్యుమెంట్లు పోగొట్టుకోవడంసహా పలు అంశాలకు సంబంధించి బీమా కవర్ ఆఫర్ కూడా లభ్యమవుతుండడం గమనార్హం. ►పర్యటనలో కరెన్సీ అయిపోతే... కార్డు హోల్డర్లు ఆన్లైన్లో మనీ-రీలోడ్ సౌలభ్యం కూడా ఉంది. ►రివార్డు పాయింట్లు, కొన్ని కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు వంటి వినూత్న ప్రయోజనాలు కూడా కస్టమర్లకు ఒనగూరుతాయి. -
‘జస్ట్’ లక్షల్లో మింగారు!
విమాన టికెట్ల పేరుతో దందా ఆరు రాష్ట్రాల్లో సాగిన మోసాలు ఇద్దరిని అరెస్టు చేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: బోగస్ ట్రావెల్ ఏజెన్సీలు ఏర్పాటు చేసి... ఇంటర్నెట్లోని జస్ట్ డయల్ వెబ్సైట్లో పొందుపరిచి... విమాన టికెట్ల పేరుతో రూ.లక్షల్లో కాజేసిన అంతరాష్ట్ర ముఠా గుట్టును సీసీఎస్ ఆధీనంలోని సైబర్‌క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేయగా.. ప్రధాన సూత్రధారితో సహా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. డీసీపీ జి.పాలరాజు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం... నగరంతో పాటు ఉత్తరాదికి చెందిన కొందరు వ్యక్తులు హైదరాబాద్‌తో పాటు పుణె, ముంబై, మంగుళూరు, చెన్నై, జమ్మూకాశ్మీర్‌ల్లో థెరపీ, కాంటినెంటల్, వైభవ్, ఆర్జో పేర్లతో బోగస్ ట్రావెల్ ఏజెన్సీలను ఏర్పాటు చేశారు. వీటిని జస్ట్ డయల్‌లో ఎన్రోల్ చేయించుకోవడంతో పాటు ఆయా నగరాల్లో స్థానిక ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. విమాన టికెట్లు, ట్రావెల్ ఏజెన్సీల కోసం జస్ట్ డయల్‌ను సంప్రదించే వినియోగదారుల సమాచారం వీరికి చేరేది. ఫోన్ ద్వారా కస్టమర్లను కాంటాక్ట్ చేసి మాట్లాడే ప్రతినిధులు తక్కువ ధరకు విమాన టికెట్లు అందిస్తామంటూ వలవేసే వారు. నగదును తమ ఖాతాల్లో జమ చేయించుకుని టికెట్ బుక్ చేసి దాని పీఎన్ఆర్ నెంబర్‌తో పాటు ఇతర వివరాలను వినియోగదారులకు పంపేవారు. టికెట్ బుక్ చేసేది ఈ బోగస్ సంస్థల వారే కావడంతో వాటిని రద్దు చేసే అవకాశమూ వీరికి ఉండేది. దీంతో ప్రయాణ సమయానికి కాస్త ముందుగా వినియోగదారులకు తెలియకుండానే జారీ చేసిన టికెట్లను రద్దు చేసి ఆ నగుదును తమ ఖాతాల్లోకి మళ్లించుకుని కాజేసేవారు. ఈ విషయం తెలియక ఎయిర్పోర్ట్ వరకు వెళ్లిన వినియోగదారులు అక్కడ అసలు సంగతి తెలుసుకుని ప్రయాణం రద్దు చేసుకోవడం లేదా ఎక్కువ ధరకు మరో టికెట్టు కొనుగోలు చేయడమో చేసేవారు. నిందితుల ఫోన్లు, బ్యాంకు ఖాతాల్లో చాలా వరకు బోగస్ వివరాలతో కూడినవి కావడంతో పట్టుబడేవారు కాదు. ఈ రకంగా ముఠా దేశ వ్యాప్తంగా అనేక మందిని మోసం చేసి రూ.లక్షల్లో స్వాహా చేసింది. నగరంలోని కొందరిని ఈ ముఠా రూ.3 లక్షల మేర మోసం చేయడంతో సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ పి.రాజు నేతృత్వంలో హెడ్-కానిస్టేబుల్ సత్యనారాయణ, కానిస్టేబుళ్లు మురారి విజయ్, సతీష్ సాంకేతికంగా దర్యాప్తు చేసి నిందితులైన సునీల్ శర్మ (మహారాష్ట్ర), మహ్మద్ అస్ఘర్ అలీ (మలక్‌పేట)లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సూత్రధారి సహా మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ తరహా సంస్థల్ని ఎలాంటి పరిశీలనా లేకుండా ఎన్రోల్ చేసుకుని, పలువురు నష్టపోవడానికి కారణమైన జస్ట్ డయల్ సంస్థకూ సంజాయిషీ కోరుతూ నోటీసు ఇస్తున్నామని డీసీపీ పాలరాజు తెలిపారు.