సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం నుంచి సింధు పుష్కరాలకు వెళ్లిన జిల్లా వాసులకు చేదు అనుభవం ఎదురైంది. మైసూర్‌కు చెందిన అకుల్ ట్రావెల్స్ ఏజెన్సీ ప్రతినిధులు.. శ్రీకాకుళం స్థానికులను టూరిజం పేరుతో యాత్రకు తీసుకెళ్లారు. ఒక్కొ కపుల్ నుంచి 60 వేలను ట్రావెల్ సిబ్బంది వసూలుచేశారు. ఈ క్రమంలో 120 మంది యాత్రికులు జమ్ముకశ్మీర్‌లోని కట్రా వద్ద హోటల్‌కి చేరుకున్నారు.
ఆ తర్వాత.. ట్రావెల్ సిబ్బంది యాత్రికులను అక్కడ వదిలేసి పరారయ్యారు. దీంతో హోటల్ వారు డబ్బులు కట్టాలని 120 మంది యాత్రికులు నిర్భందించారు. ప్రతి ఒక్కరు.. తలా పదివేలు కట్టాలంటూ యాత్రికులను హోటల్ సిబ్బంది డిమాండ్ చేశారు. దీంతో యాత్రికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యాత్రికులలో ఎక్కువగా.. పాలకొండ, నరసన్నపేట గ్రామానికి చెందిన వారున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment