
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ సంస్థ ఓయో తాజాగా నెదర్లాండ్స్‌కి చెందిన వెకేషన్ రెంటల్ సంస్థ లీజర్ గ్రూప్‌ను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. యాక్సెల్ స్ప్రింగర్ నుంచి దీన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ డీల్ విలువ సుమారు 415 మిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 2,885 కోట్లు) ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ ఆతిథ్య రంగంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు ఇది ఉపయోగపడగలదని ఓయో వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో రితేష్ అగర్వాల్ పేర్కొన్నారు.
యూరోపియన్ దేశాల్లో హాలిడే హోమ్స్, హాలిడే పార్క్‌లు, హాలిడే అపార్ట్‌మెంట్స్ నిర్వహణలో ః లీజర్ గ్రూప్ పేరొందింది. బెల్‌విల్లా, డాన్‌సెంటర్, డాన్‌ల్యాండ్ బ్రాండ్స్ కింద ః లీజర్ గ్రూప్.. యూరప్‌లోని 13 దేశాల్లో 30,000 పైగా గదులను అద్దెకిస్తోంది. అలాగే ట్రామ్ ఫెరీన్‌వోనుంజెన్ బ్రాండ్ పేరిట 50 దేశాల్లో 85,000 పైచిలుకు గృహాల యజమానులకు హోమ్ మేనేజ్‌మెంట్ సేవలు అందిస్తోంది. ః లీజర్ గ్రూప్ కొనుగోలుతో 24 దేశాల్లోని 800 నగరాల్లో ఓయో కార్యకలాపాలు విస్తరించినట్లవుతుంది. భారత్ సహా అమెరికా, బ్రిటన్, చైనా, సౌదీ అరేబియా, జపాన్ తదితర దేశాల్లో ఓయో కార్యకలాపాలు సాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment