
మలేసియాలో ఓయో రూమ్స్
బడ్జెట్ హోటల్స్ సర్వీసుల సంస్థ ఓయో రూమ్స్ విదేశాలకు కార్యకలాపాలు విస్తరించింది......
న్యూఢిల్లీ: బడ్జెట్ హోటల్స్ సర్వీసుల సంస్థ ఓయో రూమ్స్ విదేశాలకు కార్యకలాపాలు విస్తరించింది. తాజాగా మలేసియాలో కార్యకలాపాలు ప్రారంభించినట్లు సంస్థ వ్యవస్థాపక సీఈవో రితేష్ అగర్వాల్ తెలిపారు. మొబైల్స్, ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా ఉన్న మార్కెట్లలో ఒకటైనందున మలేసియాను ముందుగా ఎంచుకున్నట్లు వివరించారు.