
న్యూఢిల్లీ: ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ కన్సాలిడేటెడ్ నష్టాలు మరింత అధికమయ్యాయి. 2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ 335 మిలియన్ డాలర్ల (రూ.2,390 కోట్లు) నష్టాలను ప్రకటించింది. 2018 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి నష్టాలు రూ.52 మిలియన్ డాలర్లుగానే (రూ.370 కోట్లు) ఉండడం గమనార్హం. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న 211 మిలియన్ డాలర్ల నుంచి 951 మిలియన్ డాలర్లకు పెరిగింది. అంతర్జాతీయంగా కార్యకలాపాల విస్తరణ నష్టాలు పెరగడానికి కారణమైంది. దేశీయ కార్యకలాపాలపై నష్టాలను మొత్తం ఆదాయంలో 24 శాతం నుంచి 12 శాతానికి సంస్థ తగ్గించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment