OYO Announced Free Stay For Gold Members - Sakshi
Sakshi News home page

OYO Wizard Membership: ఓయో రూమ్స్‌ బంపరాఫర్‌, ఫ్రీగా హోటల్‌ రూమ్స్‌లో ఉండొచ్చు!

Published Fri, May 20 2022 9:31 PM | Last Updated on Sat, May 21 2022 11:19 AM

OYO announced Free Stay for Gold members - Sakshi

ఇండియన్‌ హోటల్‌ రూమ్స్‌ ఆగ్రిగ్రేటర్‌ ఓయో వినియోగదారులకు బంపరాఫర్‌ ప్రకటించింది. ట్రావెల్‌ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఓయో రూమ్స్‌ ఫ్రీగా వినియోగించుకోవచ్చని అధికారికంగా తెలిపింది. ఇందుకోసం కొన్ని షరతులు విధించింది. 


పీటీఐ నివేదిక ప్రకారం..విజార్డ్ లాయల్టీ ప్రోగ్రామ్‌లోని గోల్డ్ సభ్యులు 5రాత్రులు(5రోజుల పాటు) ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఓయో విజార్డ్‌ దేశంలో తరుచూ ప్రయాణం చేసే వారికి అందుబాటులో ఉంది. ఇతర ప్రయోజనాల్ని అందించడంతో పాటు ఓయో రూమ్స్‌ విజార్డ్ సౌకర్యం ఉన్న హోటళ్లపై  10శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. 

హైదరాబాద్‌ తో పాటు 
92 లక్షలకు పైగా సభ్యులతో ఓయో విజార్డ్ అనేది అతిపెద్ద లాయల్టీ ప్రోగ్రామ్స్‌లో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన ట్రావెల్‌ కష్టమర్లు ఎక్కువగా ఉన్నారు. వారికి అదనపు సౌకర్యాల్ని కల్పించేందుకు ఓయో విజర్డ్ బ్లూ, విజర్డ్ సిల్వర్, విజర్డ్ గోల్డ్ స్కీమ్‌లను అందుబాటులోకి తెచ్చింది.

వారికే లాభం
ఫ్రీ రూమ్ నైట్స్, తగ్గింపు ఆఫర్లు వంటి మా ప్రోత్సాహకాల వల్ల కస్టమర్లు ఓయోలో పదే పదే ఉండేందుకు మరొక అవకాశాన్ని అందుబాటులో ఉంచాం. 2021 మార్చి 31తో ముగిసిన ఏడాదిలో 70 శాతానికి పైగా రిపీట్ కస్టమర్లు ఉన్నారు. తాజా కొత్త లాయల్టీ సర్వీసుల వల్ల వీరికి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నట్లు ఓయో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ప్రొడక్ట్), చీఫ్ సర్వీస్ ఆఫీసర్ శ్రీరంగ్ గాడ్బోలే వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement