ఉదాహరణకు మనకు ఓ సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యకు ఇన్నోవేటీవ్‌గా పరిష్కారం చూపించే సంస్థల్ని స్టార్టప్స్ అంటారు. ఈ స్టార్టప్ లో లాభాలు ర్యాపిడ్‌గా గ్రో అవుతుంటాయి. మిలియన్ సంఖ్యలో యూజర్లు ఉంటారు. కోట్ల టర్నోవర్ జరుగుతుంటుంది. అలాంటి స్టార్టప్స్ కు కోవిడ్ మహమ్మారి వందల కోట్లు నష్టయేలా చేసింది.
►ఇటీవల విడుదల ఫైనాన్షియల్ ఇయర్ 2020-2021లో స్టార్టప్ కు ఎంత నష్టం వాటిల్లింది. నిమిషానికి నష్టపోయాయో తెలుపుతూ కొన్ని రిపోర్ట్‌లు వెలుగులోకి వచ్చాయి. ఆ అధ్యయనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
►రితేష్ అగర్వాల్ స్థాపించిన స్టార్టప్ ఓయో రూమ్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 రూ.3943.84 కోర్ల నష్టాలను చవిచూసింది. అంటే గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ప్రతి నిమిషానికి రూ.76,077కు పైగా నష్టపోయింది.
►ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,314 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇదే సమయంలో కంపెనీ నిమిషానికి రూ.25,347కు పైగా నష్టపోయింది.
►పేమెంట్స్ సర్వీస్ స్టార్టప్ మోబీక్విక్ ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ.111.3 కోట్లు నష్టపోయింది. అంటే ఆర్థిక సంవత్సరంలో స్టార్టప్‌కు నిమిషానికి రూ.2,147 నష్టాలు వచ్చాయి.
►మరో డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎం డిసెంబర్ త్రైమాసికంలో రూ. 778.5 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అంటే ఈ కాలంలో స్టార్టప్ ప్రతి నిమిషానికి రూ.60,069కి పైగా నష్టపోయింది.
►బీమా ప్లాట్‌ఫారమ్ పాలసీబజార్ డిసెంబర్ త్రైమాసికంలో రూ.298 కోట్లు నష్టపోయింది. ఈ కాలంలో కంపెనీ ప్రతి నిమిషానికి రూ. 22,995 నష్టపోతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి.
► ఆన్‌లైన్ ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో గత త్రైమాసికంలో రూ. 63.2 కోట్ల నష్టాన్ని నివేదించింది. నిమిషానికి రూ. 4,876 నష్టాన్ని నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment