
నాంపల్లి: ఓయో ఫ్రాంచైజీ, అసోసియేటెడ్ లాడ్జీలు ప్రేమోన్మాదులకు అడ్డాగా మారాయని సంఘ సేవకులు సీహెచ్.రాహుల్ ఆరోపించారు. వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న యువకులకు లాడ్జిల్లో గదులను కేటాయిస్తున్నారన్నారు. ఎక్కువ శాతం పెళ్లికాని అమ్మాయి, అబ్బాయిలు ఆన్‌లైన్ ద్వారా గదులను బుక్ చేసుకుని పట్టణాల్లోని ఓయో లాడ్జిలలో దిగుతూ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ మేరకు శుక్రవారం నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఓయో ఫ్రాంచైజీ, అసోసియేటెడ్ హోటల్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఈ హోటల్స్‌లో పెళ్లికాని వారిని అనుమతించకుండా చూడాలన్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన ప్రేమోన్మాది ఘటన కూడా ఓయో హోటల్‌లోనే జరిగిందని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment