
దేశ రాజధానిలో 24 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కోపంతో అతడి తమ్ముడు, మరో వ్యక్తి కలిసి యువతిని తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘోర ఘటన ఢిల్లీలోని జైత్‌పూర్‌లో శుక్రవారం వెలుగుచూసింది.
ఢిల్లీకి చెందిన క్రిష్ణన్‌కు(37)కు పెళ్లై నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే తన సహోద్యోగి అయిన పూజా యాదవ్(24)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి సంబంధానికి క్రిష్ణన్ తమ్ముడు క్రిష్ణన్ తమ్ముడు రాకీ సంబంధానికి అభ్యంతరం చెప్పడంతో ఆమె ఉద్యోగం మానేసింది.
అయినా పూజాపై రాకీ పగబట్టాడు. ఎలాగైనా యువతిని చంపాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం యువతి ఇంట్లో ఒంటరిగా ఉండగా.. రాత్రి తొమ్మిది గంటల సమయంలో మరో వ్యక్తితో కలిసి రాకీ.. ముఖానికి మాస్కులు వేసుకొని పూజాను ఇంట్లోకి చొరబడ్డారు. యువతిని బలవంతంగా బంధించి ఆమెపై అయిదు రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పుల శబ్ధం వినపడటంతో స్థానికులు పరుగెత్తుకు వచ్చి దుండగులను వెంబడించారు. వారిని చూసి ఇద్దరు నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కొన ఊపిరితో ఉన్న యువతిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని పూజా లవర్ క్రిషన్ సోదరుడు రాకీగా గుర్తించారు.
చదవండి: ఏం కష్టం వచ్చిందో.. ముగ్గురు చిన్నారులు సహా కుటుంబం ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment