నిప్పంటుకుని వివాహిత మృతి
నిప్పంటుకుని వివాహిత మృతి
Published Thu, Jul 28 2016 7:47 PM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM
మనుబోలు : వంట చేస్తుండగా ఒంటికి నిప్పంటుకుని వివాహిత మృతి చెందిన సంఘటన మనుబోలు దళితవాడలో గురువారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు... దళితవాడకు చెందిన మోచర్ల వెంకటరమణయ్య భార్య సురేఖ (28) ఇంట్లో వంట చేస్తుండగాప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుంది. ఆమె అరుపులు విని చుట్టు పక్కల వాళ్లు మంటలను ఆర్పి 108కు సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆమె శరీరం 80 శాతం పైగా కాలిపోయింది. 108 సిబ్బంది చికిత్స నిమిత్తం ఆమెను అంబులెన్స్‌లో నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. అంబులెన్స్ వచ్చేలోపు ఒళ్లు కాలి సురేఖ చేసిన హాహాకారాలు స్థానికులను కంట తడి పెట్టించాయి. సురేఖకు ఎనిమిదేళ్ల కుమారుడు జయసూర్య, ఆరేళ్ల కుమార్తె నందిని ఉన్నారు. సురేఖ మృతితో స్థానిక దళితవాడలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement