పంజాగుట్టలో యువతి సజీవ దహనం!
హైదరాబాద్ : పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ యువతిని సజీవ దహనం చేశారు. శ్రీనగర్ కాలనీ సిగ్నల్స్ సమీపంలోని అగర్వాల్ ఐ ఆస్పత్రి వెనుక ఉన్న ఐఏఎస్ క్వార్టర్స్ ఖాళీ స్థలంలో 25ఏళ్ల యువతి మృతదేహం లభ్యమైంది. దుండగులు ఆ యువతి మృతదేహాన్ని పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. కాగా మృతురాలి వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.