Woman burnt alive
-
గుడిసెకు నిప్పంటుకుని వృద్ధురాలు సజీవదహనం
-
అక్రమ సంబంధంతో భార్యను హతమార్చిన పోలీసు
వదినతో తన వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించిందన్న కోపంతో.. కట్టుకున్న భార్యను సజీవదహనం చేశాడో పోలీసు భర్త. ఈ ఘటన బీహార్‌లోని నలంద జిల్లాలో జరిగింది. మృతురాలి సోదరుడు సింకు కుమార్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సోదరికి బీహార్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసే మహేష్ యాదవ్‌ను ఇచ్చి 2009లో పెళ్లి చేశామని చెప్పాడు. అయితే.. అతడికి తన వదినతో వివాహేతర సంబంధం ఉందని తెలిసి తన సోదరి అందుకు అభ్యంతరం తెలిపిందని సింకు కుమార్ పోలీసులకు చెప్పారు. ఆమెను అతడు తరచు చిత్రహింసలు పెట్టేవాడని, చివరకు ఏకంగా సజీవ దహనం చేసేశాడని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఆరుగురి పేర్లను పేర్కొనగా, అందరూ పరారీలో ఉన్నారు. వారిని అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. -
పంజాగుట్టలో యువతి సజీవ దహనం!
హైదరాబాద్ : పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ యువతిని సజీవ దహనం చేశారు. శ్రీనగర్ కాలనీ సిగ్నల్స్ సమీపంలోని అగర్వాల్ ఐ ఆస్పత్రి వెనుక ఉన్న ఐఏఎస్ క్వార్టర్స్ ఖాళీ స్థలంలో 25ఏళ్ల యువతి మృతదేహం లభ్యమైంది. దుండగులు ఆ యువతి మృతదేహాన్ని పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. కాగా మృతురాలి వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
రాజమండ్రిలో మహిళ సజీవ దహనం
రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. రాజమండ్రి రాజేంద్రనగర్‌లో ఓ మహిళ సజీవ దహనమైంది. నిత్యం రద్దీగా వుండే నడిరోడ్డుమీద ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. మృతురాలిని... పిఠాపురం మండలం గెద్దనాపల్లికి చెందిన డి.కుమారిగా గుర్తించారు. ఐదేళ్ల క్రితం ఆమె కుటుంబం రాజమండ్రి వలస వచ్చి.. ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా జీవనం సాగిస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అక్కను సజీవదహనం చేసిన తమ్ముడు
లింగాల: మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండలం రాయవరానికి చెందిన గొడచర్ల మంగమ్మ(45)ను ఆమె తమ్ముడు బొందయ్య సజీవదహనం చేశాడు. మానవత్వం మరచి..చిన్నవిషయానికే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పటించాడు. వివరాలు.. గొడచర్ల మంగమ్మకు సుమారు 20 ఏళ్ల క్రితం నిరంజన్‌తో వివాహమైంది. వారి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు. ఏడేళ్ల క్రితం మంగమ్మకు మరో వ్యక్తితో రెండో వివాహం చేశారు. మూడేళ్లకే వారు విడిపోయారు. అప్పటి నుంచి మంగమ్మ పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో తరచూ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం మంగమ్మకు ఆమె తమ్ముడు బొందయ్య భార్యతో ఘర్షణ జరిగింది. రాత్రి ఇంటికి వచ్చిన బొందయ్యకు ఘర్షణ విషయం తెలిసింది. శుక్రవారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఉన్న బొందయ్య అక్క మంగమ్మ వద్దకు వెళ్లి కిరోసిన్‌పోసి నిప్పటించాడు. దీంతో ఆమె అక్కడిక్కడే చనిపోయింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.