మహిళను తొక్కి చంపిన ఏనుగులు | elephants attack on women | Sakshi
Sakshi News home page

మహిళను తొక్కి చంపిన ఏనుగులు

Published Tue, Dec 30 2014 9:06 AM | Last Updated on Thu, Jul 11 2019 6:30 PM

మహిళను తొక్కి చంపిన ఏనుగులు - Sakshi

మహిళను తొక్కి చంపిన ఏనుగులు

చిత్తూరు:  మరోసారి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మంగళవారం ఉదయం కుప్పం సరిహద్దుల్లో ఏనుగులు చేసిన దాడిలో ఓబమ్మ(50) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది.  పశువులను కాయడానికి అటవీ ప్రాంతానికి వెళ్లని ఆమెపై ఏనుగులు  ఆకస్మికంగా దాడి చేసి తొక్కి చంపాయి.  ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు. 

(రైతును తొక్కి  చంపిన ఏనుగులు)

ఈ మధ్య కాలంలో అటవీ ప్రాంతానికి వెళ్లిన జనాలపై ఏనుగులు దాడి చేయడం అక్కడ కలకలం సృష్టిస్తోంది. అంతకుముందు వీ కోట మండలం కారగల్లులో ఏనుగులు చేసిన దాడిలో  ఓ రైతు మృతి చెందిన విషయం తెలిసిందే. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement