ఆలేరు: భానుడి భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి. వడదెబ్బ బారిన పడి శనివారం జిల్లా వ్యాప్తంగా 20 మంది మృతిచెందారు. పట్టణంలోని రాంశివాజీనగర్‌కు చెందిన కడకంచి సుశీ ల(70), ఆలేరులోని బంధువుల ఇంటికి వచ్చిన వరంగల్ జిల్లా వనపర్తికి చెందిన నర్సింగరావు(71) శనివారం వడదెబ్బకు గురై మృతిచెందారు.
కేతేపల్లి: ఇనుపాములకు చెందిన రావుల లచ్చయ్య(75) ఇంటి వద్దనే చికిత్స చేయిస్తుండగా శుక్రవారం రాత్రి మృతి చెందాడు.
అర్వపల్లి:మండలంలోని కాసర్లపహాడ్‌కు చెందిన మంచాల వెంకటనర్సయ్య (72), జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన బొల్లేపల్లి మొఘులయ్య (65) వడదెబ్బతో మృతిచెందారు.
పిల్లలమర్రిస్టేజీ(సూర్యాపేటరూరల్) : రాయిని గూడెం గ్రామ పరిధి పిల్లలమర్రిస్టేజీ వద్ద నివా సం ఉంటున్న గుండా రంగమ్మ(85) వడదెబ్బతో మృతిచెందింది.
నూతనకల్ : మండల పరిధిలోని జి.కొత్తపల్లి గ్రా మానికి చెందిన పగిళ్ల వీరయ్య(65) పెరిగిన ఉష్ణోగ్రతలకు అస్వస్థతకు గురయ్యాడు. ఇంట్లోనే చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
వేములపల్లి : మండలకేంద్రంలోని ఎన్‌ఎస్‌పీ క్యాంపునకు చెందిన సిలివేరు లక్ష్మమ్మ (70) వడద్బెతో మృతిచెందింది.
ఆత్మకూర్(ఎస్) : మండల పరిధిలోని నశీంపేట కు చెందిన ముల్కలపెల్లి నర్సమ్మ (58) వడదెబ్బకు గురై మృతిచెందింది.
మోత్కూరు : గట్టుసింగారం గ్రామానికి చెందిన చెరుకు నర్సమ్మ(71)ఎండి వేడికి తాళలేక తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందినట్లు తెలిపారు.
ఆత్మకూర్(ఎం) : మండలంలోని పల్లెర్ల గ్రామానికి చెందిన గుర్రం తిరుపతమ్మ(70) ఉదయం గ్రా మంలో తిరిగి మధ్యాహ్నాం ఇంటికి వచ్చింది. దాహం వేయడంతో మంచి నీళ్లు తాగి అలాగే కుప్పకూలి మృతిచెందింది.
మేళ్లచెర్వు : మండలంలోని హేమ్లాతండా గ్రామపంచాయతీ పరిధి రాఘవాపురం గ్రామానికి చెందిన దాసరి వీరస్వామి (75) వడదెబ్బతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
కనగల్ : మండలంలోని పొనుగోడు గ్రామానికి చెందిన మొండికత్తి హుస్సేన్(22) తుర్కపల్లి గ్రామ పరిధిలోని ఎం.గౌరారం గ్రామానికి చెందిన వికలాంగుడు బొమ్మపాల నాగరాజు(19) వడదెబ్బతో మృతిచెందారని బంధు వులు తెలిపారు.
శాలిగౌరారం: మండలంలోని అంబారి పేటకు చెందిన పబ్బు అర్వపల్లి (65) వడ దెబ్బతో మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
నల్లగొండ టుటౌన్ : నల్లగొండ పట్టణ పరిధి పానగల్‌కు చెందిన కుంచపు నాగమ్మ (30) ఎండకు జ్వరం వచ్చి మూడు క్రితం ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందందని కుటుంబసభ్యులు తెలిపారు.
మిర్యాలగూడ టౌన్ : పట్టణంలోని షాబునగర్‌కు చెందిన మిల్లు డ్రైవర్ విజయనగరం నారాయణమూర్తి(48) చిలువేరు లక్ష్మమ్మ(70) శాంతినగర్‌కు చెందిన తిరుపనేని నాగేశ్వర్‌రావు(52) వడదెబ్బతో మృతిచెందినట్టు బంధువులు తెలిపారు.
వడదెబ్బతో 20 మంది మృతి
Published Sun, May 31 2015 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM
Advertisement
Advertisement