మానస తల్లి గాదం స్వరూప శనివారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్మృతి వనం వద్ద 8 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పందించక పోవడంతో స్వరూప 9వ రోజు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. నవంబర్ 27న పుట్టిన రోజు సందర్భంగా గుడికి వెళ్లిన మానస.. అత్యాచారం, హత్యకు గురైన విషయం విదితమే. అనంతరం హైదరాబాద్‌లో దిశ ఘటన చోటుచేసుకుంది.
ఆమరణ నిరాహార దీక్షకు దిగిన మానస తల్లి..
Published Sat, Dec 14 2019 9:07 PM | Last Updated on Wed, Mar 20 2024 5:39 PM