
కొచ్చి: గత నెలలో జరిగిన డెంటల్ విద్యార్ధిని మానస హత్య కేసులో కీలక విషయాలు బయటికొస్తున్నాయి. కేసుకు సంబంధించి బీహార్‌లోని మంగేర్ జిల్లాలో 21 ఏళ్ల సోను కుమార్ మోదీని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీవీ మానస(24) ఇందిరా గాంధీ కాలేజీలో డెంటల్ కోర్సు ఫైనల్ ఇయర్ చదువుతోంది. అక్కడే స్నేహితులతో కలిసి రూమ్‌లో ఉంటోంది. రాఖిల్ (32) కూడా అదే జిల్లాకు చెందిన వాడు.
రెండేళ్ల క్రితం ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారు. వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఆ తరువాత రాఖిల్ నువ్వు ఏ అబ్బాయితోనూ మాట్లాడొద్దు, చాటింగ్ చెయ్యొద్దంటూ కంట్రోల్ చెయ్యడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు అతడు పెడుతున్న షరతులు భరించలేక బ్రేకప్ చెప్పింది. అతడిని అవాయిడ్ చేయడం మొదలు పెట్టింది. దీనిని భరించలేని రాఖిల్ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే.. నన్నే కాదంటుందా అని ఆమెపై పగ పెంచుకున్నాడు.
మానస లేని జీవితం తనకి వద్దనుకున్నాడు. ప్రతి రోజూ మానసనే తలచుకుంటూ ఓ సైకోలా తయారయ్యాడు. తనకు దక్కని మానస ఇంకెవరికీ దక్కకూడదనుకున్నాడు. చివరికి ఓ ఉబర్ క్యాబ్ డ్రైవర్ సాయంతో బీహార్‌లో సోను కుమార్ మోదీ అనే వ్యక్తి దగ్గర నాటు తుపాకీ కొన్నాడు. కేరళలోని కొత్తమంగళంలో మానస రూమ్‌కు దగ్గర్లోనే ఓ రూమ్ అద్దెకు తీసుకున్నాడు. అక్కడే ఒక ప్లైవుడ్ కంపెనీలో పనిచేయడానికి వచ్చానని గది ఓనర్‌కి చెప్పాడు. అక్కడే మానసను ఎలా హతమార్చాలో పక్కా ప్లాన్ రచించాడు. గత వారం మానసను గన్‌తో కాల్చిన తర్వాత తనూ సూసైడ్ చేసుకున్నాడు. మరి రాఖిల్‌కి ఈ హత్యలో ఇంకెవరైనా సహకరించారా? అనేదానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment