కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లాలో సోమవారం రాత్రి ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పెనమలూరు మండలం యనమలకుదురుకు చెందిన వలశిల విజయ్‌కుమార్, అతని భార్య కలసి కొండపల్లిలో ఓ గృహప్రవేశ కార్యక్రమానికి సోమవారం సాయంత్రం వెళ్లారు. వారి ముగ్గురు కమార్తెలు మానస(15), మమత, థెరీసాలను ఇంట్లోనే ఉంచి వెళ్లారు.
అక్కాచెల్లెళ్లు మ్యాగి చేసుకుని తిని, కూల్ డ్రింక్ తాగారు. అనంతరం మానస నురగలు కక్కుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఇరుగు పొరుగు వారు వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మానస మృతి చెందింది. మిగతా ఇద్దరికీ ఏమీ కాకపోవడం, మానస ఒక్కతే మృతి చెందడంతో అనుమానాస్పద మృతి కింద పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి
Published Tue, Apr 26 2016 10:34 AM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM
Advertisement
Advertisement