unsuspicious death
-
అత్తగారింటికొచ్చి, అనుమానాస్పదంగా చెరువులో శవమై..
సాక్షి, కరీంనగర్: వెల్గటూర్ మండలకేంద్రంలోని పెద్దవాగులో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన నస్పూరి రాజేందర్ (42)కు మండలకేంద్రానికి చెందిన పుట్టపాక శంకరమ్మ–కిష్టయ్య కూతురు స్రవంతితో 15 ఏళ్లక్రితం వివాహం జరిగింది. రజక కులానికి చెందిన రాజేందర్ శుభకార్యాలకు వంట పనులు చేస్తుంటాడు. మంగళవారం ఉదయం పనినిమిత్తం వెల్గటూర్‌లోని తన అత్తగారింటికి వచ్చాడు. ఓ శుభకార్యంలో మేకలు కోసేందుకు వెళ్లి రాత్రయినా ఇంటికి రాలేదు. దీంతో బావమరిది పుట్టపాక జయందర్ మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. బుధవారం ఉదయం రాజేందర్ మృతదేహం వెల్గటూర్‌లో పెద్దవాగులో లభ్యమైంది. అయితే రాజేందర్ మంగళవారం సాయంత్రం రాజక్కపల్లిలోని ధర్మాజి సత్యం ఇంటికి వెళ్లాడని, అక్కడ గొడవ జరగడంతో పారిపోతుండగా పెద్దవాగులో ఈదుకుంటూ వెళ్లి మునిగిపోయినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో రాజేందర్ మృతిపై ధర్మాజి సత్యం, ధర్మాజి గంగారాంపై అనుమానాలున్నాయని జయంధర్ ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్వేత పేర్కొన్నారు. ఇవి కూడా చదవండి: నా కొడుకుది ప్రమాదం కాదు, కావాలనే ఇలా చేశారు! -
'ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే' హత్య చేశారా..! అసలేం జరిగింది..??
మహబూబాబాద్: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అతడిని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కొట్టి చంపి కుంటలో పడవేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసి కుంటలో పడి మృతి చెందినట్లు చిత్రీకరించారంటూ ఆరోపిస్తున్నారు. ఎస్సై నైనాల నగేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రేలకుంటకు చెందిన మూడు స్వామి(33)కి అదే గ్రామానికి జ్యోతితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలంగా స్వామి మద్యానికి బానిసయ్యాడు. గత శుక్రవారం భార్య జ్యోతి ఆరోగ్యం బాగా లేకపోవడంతో తల్లి గారింటికి వెళ్లిపోయింది. అదేరోజు సాయంత్రం నుంచి అతను కనిపించడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, తెలిసిన వారికి ఫోన్ చేసి ఆచూకీ కోసం వెతికారు. కానీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం రేలకుంట శివారులోని పుల్లమ్మకుంటలో మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహం వద్దకు చేరుకుని విలపించారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు స్వామికి ఇన్సూరెన్స్ చేయించి పథకం ప్రకారం హత్య చేసి ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందినట్లు చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలు గ్రామంలో వినిపిస్తున్నాయి. మృతుడి తండ్రి సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మిస్టరీగా మారిన మానస కేసు
* నూడుల్సే కారణమంటున్న తల్లిదండ్రులు * ఫోరెన్సిక్ లేబరేటరీకి వివరాలు యనమలకుదురు (పెనమలూరు): యనమలకుదురు గ్రామం లో సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పదో తరగతి విద్యార్థిని వెలిశిల మానస(15)కేసు మిస్టరీగా మారింది. బాలిక నూడిల్స్ తిని మృతి చెందిందని తల్లిదండ్రు లు చెబుతుండగా, వడదెబ్బ వలనే ఆమె మృతి చెందిందని వైద్యులు, పోలీసులు భావిస్తున్నారు. కేసు వివాదంగా మారటంతో పూర్తి వివరాల కోసం హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ లేబరేటరీకి వివరాలు పంపారు. యనమలకుదురు అంబేడ్కర్‌నగర్‌కు చెందిన వెలిశిల విజయ్‌కుమార్‌కు ముగ్గురు కుమార్తెలు. తల్లిదండ్రులు కొండపల్లికి వెళ్లటంతో ఇంట్లో ఉన్న మానస, మమత, నమ్రత సమీపంలో ఓ షాపులో ప్రముఖ కంపెనీకి చెందిన నూడుల్స్ కొని ఇంట్లో వండుకుని శీతల పానీయంతో తిన్నారు. కొద్ది సమయానికి మానస వాంతులు చేసుకుని కుప్పకూలి పోయింది. మిగతా ఇద్దరూ స్వల్ప అస్వస్థతకు గురైనా వారికి ఏమీ కాలేదు. మానసను వైద్యం కోసం విజయవాడ తరలించగా ఆమె చనిపోయింది. అయితే ఆమె ఎందుకు చనిపోయిందనేది మిస్టరీగా ఉంది. తల్లిదండ్రులు ఏమంటున్నారంటే.. ఆమె తల్లితండ్రులు మాత్రం తమ బిడ్డ నూడుల్స్ తినటం వలనే చనిపోయిందని చెబుతున్నారు. దీంతో పోలీసులు నూడుల్స్ ప్యాకెట్, వండగా మిగిలిన నూడుల్స్, శీతలపానీయం సీజ్ చేశారు. అలాగే నూడుల్స్ అమ్మిన కొట్టు యజమాని తమ్ము సుశీల స్టేట్మెంట్ను పోలీసులు నమోదు చేశారు. నూడుల్స్ చాలా మందికి అమ్మానని వాటి డేట్ ఎక్సపేర్ కాలేదని ఆమె పోలీసులకు తెలిపింది. పోలీసులు మానస మృతదేహానికి పోస్టుమార్టం చేయించి ఆయా వివరాలు, సీజ్ చేసిన ఆహార పదార్ధాన్ని హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ లేబరేటరీకి పంపారు. ఈ నివేదిక నెల రోజుల్లో వస్తుందని పోలీసులు తెలిపారు.అప్పటి వరకు కేసు విషయం ఏమీ తేల్చి చెప్పలేమన్నారు. -
అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి
కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లాలో సోమవారం రాత్రి ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పెనమలూరు మండలం యనమలకుదురుకు చెందిన వలశిల విజయ్‌కుమార్, అతని భార్య కలసి కొండపల్లిలో ఓ గృహప్రవేశ కార్యక్రమానికి సోమవారం సాయంత్రం వెళ్లారు. వారి ముగ్గురు కమార్తెలు మానస(15), మమత, థెరీసాలను ఇంట్లోనే ఉంచి వెళ్లారు. అక్కాచెల్లెళ్లు మ్యాగి చేసుకుని తిని, కూల్ డ్రింక్ తాగారు. అనంతరం మానస నురగలు కక్కుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఇరుగు పొరుగు వారు వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మానస మృతి చెందింది. మిగతా ఇద్దరికీ ఏమీ కాకపోవడం, మానస ఒక్కతే మృతి చెందడంతో అనుమానాస్పద మృతి కింద పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడి అనుమానాస్పద మృతి
వైఎస్సార్ జిల్లా: అనుమానాస్పదంగా ఓ యువకుడు మృతి చెందిన సంఘటన పోరుమామిళ్లలోని కమ్మవారిపల్లెలో ఆదివారం ఉదయం జరిగింది. జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు కమ్మవారిపల్లెలోని గవర్నమెంట్ కాలేజీ సమీపంలో ఉంటున్నాడు. ఆ యువకుడు కుటుంబ సభ్యులతో గొడవపడి తరుచూ ఇళ్లు వదిలి వెళుతుంటాడు. ఇటీవలే ఇంటికి వచ్చిన అతను శనివారం కుటుంబ సభ్యులతో గొడవపడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆదివారం అతను గదిలో ఉరివేసుకున్నాడు. ఉదయం కుటుంబ సభ్యులు తలుపులు తెరవగా మృతిచెంది ఉన్నాడు. హుటాహుటినా కుటుంబ సభ్యులు మృతుడికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అతని మృతిపై పలు అనుమానాలు నెలకొన్నాయి.