యువకుడి అనుమానాస్పద మృతి | youth unsuspicious death in ysr district | Sakshi
Sakshi News home page

యువకుడి అనుమానాస్పద మృతి

Published Sun, Mar 6 2016 9:43 AM | Last Updated on Sun, Sep 3 2017 7:09 PM

youth unsuspicious death in ysr district

వైఎస్సార్ జిల్లా: అనుమానాస్పదంగా ఓ యువకుడు మృతి చెందిన సంఘటన పోరుమామిళ్లలోని కమ్మవారిపల్లెలో ఆదివారం ఉదయం జరిగింది. జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు కమ్మవారిపల్లెలోని గవర్నమెంట్ కాలేజీ సమీపంలో ఉంటున్నాడు. ఆ యువకుడు కుటుంబ సభ్యులతో గొడవపడి తరుచూ ఇళ్లు వదిలి వెళుతుంటాడు.

ఇటీవలే ఇంటికి వచ్చిన అతను శనివారం కుటుంబ సభ్యులతో గొడవపడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆదివారం అతను గదిలో ఉరివేసుకున్నాడు. ఉదయం కుటుంబ సభ్యులు తలుపులు తెరవగా మృతిచెంది ఉన్నాడు. హుటాహుటినా కుటుంబ సభ్యులు మృతుడికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అతని మృతిపై పలు అనుమానాలు నెలకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement