
మతిస్థిమితం లేని యువతి అదృశ్యం
హైదరాబాద్: మతిస్థిమితం లేని యువతి అదృశ్యమైన ఘటన నగరంలోని హబ్సీగూడలో చోటు చేసుకుంది. జె. మానస(19) అనే యువతి శనివారం రాత్రి ఇంట్లోంచి వెళ్లి తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మానస తండ్రి ఇటీవల మృతి చెందిన సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ జే. శ్రీనివాసులు.
మానస ఆచూకీ తెలిసిన వారు 9441368944కు సమాచారం ఇవ్వాల్సిందిగా కుటుంబసభ్యులు కోరుతున్నారు. కేసు నమోదు చేసిన ఉస్మానియా యూనివర్సటీ పోలీసులు విచారణ జరుపుతున్నారు.