![Telangana got three medals in Kick Boxing - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/16/KIck-Boxing.jpg.webp?itok=KJOqFavc)
సాక్షి, హైదరాబాద్: జాతీయ కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్లు రాణించారు. హిమాచల్‌ప్రదేశ్ సోలంకి యూనివర్సిటీలో జరిగిన ఈ టోర్నీలో రెండు రజతాలు, ఒక కాంస్యా న్ని సాధించారు. రాష్ట్రానికి చెందిన నితీశ్ కుమార్, అక్షర రజతాలను గెలుచుకోగా, స్టాలిన్ కాంస్యాన్ని నెగ్గాడు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డిని రాష్ట్ర కిక్ బాక్సింగ్ బృందం శుక్రవారం కలిసింది.
జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచిన బాక్సర్లను శాట్స్ చైర్మన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ రిఫరీ తిరుపతి, తెలంగాణ కిక్ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు సి. రామాంజనేయ, కార్యదర్శి మహిపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment