ఓవరాల్ చాంపియన్ మహారాష్ట్ర (PC: Nat_Games_Goa)
పనాజీ (గోవా): జాతీయ క్రీడల్లో మహారాష్ట్ర 1994 తర్వాత తొలిసారి ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. గురువారం ముగిసిన ఈ క్రీడల్లో మహారాష్ట్ర 80 స్వర్ణాలు, 69 రజతాలు, 79 కాంస్యాలతో కలిపి మొత్తం 228 పతకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
ఓవరాల్ చాంపియన్ హోదాలో రాజా భళీంద్ర సింగ్ ట్రోఫీని మహారాష్ట్ర సొంతం చేసుకుంది. పురుషుల విభాగంలో తమిళనాడు స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ ‘ఉత్తమ అథ్లెట్’గా... మహిళల విభాగంలో ఒడిశా జిమ్నాస్ట్‌లు సంయుక్త కాలే, ప్రణతి నాయక్ ‘ఉత్తమ అథ్లెట్స్’గా ఎంపికయ్యారు.
ఉత్తమ అథ్లెట్‌గా జిమ్నాస్ట్ సంయుక్త కాలే(PC: Nat_Games_Goa)
ఆంధ్రప్రదేశ్‌కు 27 పతకాలు
మొత్తంగా 42 క్రీడాంశాల్లో 11 వేలకుపైగా క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ 7 స్వర్ణాలు, 5 రజతాలు, 15 కాంస్యాలతో కలిపి 27 పతకాలతో 19వ స్థానంలో... తెలంగాణ 4 స్వర్ణాలు, 10 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి 25 పతకాలతో 22వ స్థానంలో నిలిచాయి. ముగింపు వేడుకలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment