జాతీయ క్రీడలకు తెర | National sports scenes | Sakshi
Sakshi News home page

జాతీయ క్రీడలకు తెర

Published Sun, Feb 15 2015 1:10 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

జాతీయ క్రీడలకు తెర - Sakshi

జాతీయ క్రీడలకు తెర

తిరువనంతపురం: పదిహేను రోజులపాటు అలరించిన జాతీయ క్రీడలకు శనివారం తెరపడింది. పురుషుల విభాగంలో స్విమ్మర్ సజన్ ప్రకాశ్, మహిళల విభాగంలో స్విమ్మర్ ఆకాంక్ష వోరా ‘ఉత్తమ అథ్లెట్స్’ పురస్కారాలను అందుకున్నారు. ఈ క్రీడల్లో ప్రకాశ్ ఆరు స్వర్ణాలు గెలిచాడు.
 
  సర్వీసెస్ జట్టు వరుసగా మూడోసారి ఓవరాల్ ట్రోఫీ గెల్చుకుంది. కేరళ గవర్నర్ జస్టిస్ (రిటైర్డ్) పి.సదాశివం ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ క్రీడలు ముగిశాయని ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ చదివి వినిపించారు. తమ ప్రతిభతో రాణించిన క్రీడాకారులందరికీ తన సందేశంలో ప్రధాని అభినందించారు. తదుపరి జాతీయ క్రీడలు వచ్చే ఏడాది గోవాలో జరుగుతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement