Best athlete
-
అంతర్జాతీయ వుషు ‘ఉత్తమ క్రీడాకారిణి’గా రోషిబినా దేవి
భారత సీనియర్ వుషు క్రీడాకారిణి నరోమ్ రోషిబినా దేవికి అరుదైన గౌరవం లభించింది. 2023 సంవత్సరానికి ఈ మణిపూర్ అమ్మాయి ‘సాండా’ కేటగిరీలో ‘అంతర్జాతీయ ఉత్తమ క్రీడాకారిణి’ పురస్కారం గెల్చుకుంది. పబ్లిక్ ఓటింగ్‌లో రోషిబినాకు అత్యధికంగా 93,545 ఓట్లు లభించాయని అంతర్జాతీయ వుషు సమాఖ్య తెలిపింది. 2023 జాతీయ క్రీడా పురస్కారాల్లో ‘అర్జున’ అవార్డు గెల్చుకున్న 23 ఏళ్ల రోషిబినా 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం, 2022 ఆసియా క్రీడల్లో రజతం సాధించింది. -
Simon Byles: విజయాలే భారమై...
టోక్యో: రియో ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు, వివిధ వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో కలిపి ఏకంగా 19 స్వర్ణాలు... మొత్తంగా అంతర్జాతీయ వేదికపై 36 పతకాలతో జిమ్నాస్టిక్స్ చరిత్రలో అత్యుత్తమ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమెరికా యువ తార సిమోన్ బైల్స్. ►టోక్యో ఒలింపిక్స్‌కు తమ దేశం తరఫున మరో సారి భారీ అంచనాలతో వెళ్లిన బైల్స్‌ను మానసిక సమస్యలు వీడటం లేదు. మంగళవారం టీమ్ ఈవెంట్ ఫైనల్లో ఒక్క ‘వాల్ట్’లోనే ఒకే ఒక ప్రయత్నం చేసి తప్పుకున్న బైల్స్... గురువారం జరిగే ఆల్ ఆరౌండ్ ఈవెంట్లో కూడా పాల్గొనడం లేదని ప్రకటించింది. ప్రస్తుతం తాను మానసికంగా సిద్ధంగా లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది. వచ్చేవారంలో జరిగే వ్యక్తిగత ఈవెంట్లలో కూడా ఆమె పాల్గొంటుందా లేదా అనేదానిపై స్పష్టత రాలేదు. ప్రతీ రోజు ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన అనంతరమే నిర్ణయం తీసుకుంటా మని అమెరికా ఒలింపిక్ వర్గాలు వెల్లడించాయి. ఒత్తిడి పెరిగిపోయిందా..! జాగ్రత్తగా చూస్తే బైల్స్ పాల్గొనే ఈవెంట్లలో ఆమె ధరించే డ్రెస్‌పై ఏదో ఒక మూల ‘మేక’ బొమ్మ ము ద్రించి ఉంటుంది. ఇది ఏదో రాశిని బట్టి పెట్టుకు న్నది కాదు... ఎౖఅఖీ (ఎట్ఛ్చ్ట్ఛట్ట ౖజ అ ∙ఖీజీఝ్ఛ)... చరిత్రలో అత్యుత్తమ ప్లేయర్ అని గుర్తు చేయడం దాని ఉద్దేశం! ఒలింపిక్స్‌లో తన సత్తా చాటేందుకు ఆమె టోక్యో బయల్దేరినప్పుడు అమెరికా విమానయాన సంస్థ ‘యునైటెడ్’ కూడా ఫ్లయిట్లో ఇలాంటి వస్తువులే ఇచ్చి గౌరవం ప్రదర్శించుకుంది. మైకేల్ ఫెల్ప్స్ లాంటి దిగ్గజం లేకపోవడంతో అమెరికా దేశానికి ఈ ఒలింపిక్స్‌లో ఆమె ఒక ‘ముఖచిత్రం’ తరహాలో మారిపోయింది. ► ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు ముందు ఒకవైపు తన బ్రాండ్ పేరును కాపాడుకోవాలి. స్పాన్సర్లను సంతోషపెట్టాలి. అటు అభిమానులను అలరించాలి. ఇటు ఇంటా, బయటా విమర్శకులకు సమాధానమివ్వాలి. ఇదంతా 24 ఏళ్ల బైల్స్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచింది. టోక్యోలో ఆమె మానసికంగా కుప్పకూలిపోవడం అనూహ్యమేమీ కాదు. ► ‘రియో’ విజయాల తర్వాత చాలాసార్లు ఆమె మానసికంగా ఆందోళనకు గురైంది. కిడ్నీలో రాయితో ఇబ్బంది పడుతున్న దశలో కూడా అందరి కోసం ఆమె 2018 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగాల్సి వచ్చింది. కరోనా సమయంలో హ్యూస్టన్‌లోని తన ఇంట్లో ఉన్న సమయంలో వరుసగా పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు రావడం, అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడగడం బైల్స్‌ను బాగా ఇబ్బంది పెట్టింది (జపాన్ టెన్నిస్ స్టార్ నయోమి ఒసాకా కూడా ఇదే కారణం చెబుతూ ఫ్రెంచ్ ఓపెన్‌లో తప్పుకుంది). ► అమెరికా ఒలింపిక్స్ ట్రయల్స్ సందర్భంగా ఆమె సహచరి సునీసా లీకంటే కూడా బైల్స్ వెనుకబడింది. గత ఎనిమిదేళ్లలో ఇలా జరగలేదు. గత రియో ఒలింపిక్స్‌లో బైల్స్‌పై ఏ ఒత్తిడి లేదు. స్వేచ్ఛగా, చలాకీగా విన్యాసాలు ప్రదర్శిస్తూ పతకాలు కొల్లగొట్టింది. ► తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో మంగళవారం ‘వాల్ట్’ విన్యాసం చేసినప్పుడు ఆమెలో ఉత్సా హం కనిపించలేదు. 2 1/2 ట్విస్ట్‌లు చేయాల్సిన చోట 1 1/2 ట్విస్ట్‌కే పరిమితమైంది. సరిగ్గా చెప్పాలంటే కాస్త గట్టిగా ప్రయత్నిస్తే ఏమైనా దెబ్బలు తగులుతాయేమో అని భయపడే కొత్త జిమ్నాస్ట్లాగా కనిపించింది. ఎంతో సాధించిన తర్వాత ఇంకా రిస్క్ చేసి ప్రమాదం కొనితెచ్చుకోవడం ఎందుకనే భావన ఆమె వ్యాఖ్యల్లోనూ వినిపించింది. తాను పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసంతో లేకపోయినా సరే... అందరినీ సంతృప్తిపరచడం కోసమే బైల్స్ ఒలింపిక్స్‌కు వచ్చినట్లుగా కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే వ్యక్తిగత విభాగంలోనూ ఆమె పోటీ పడకపోవచ్చు! ప్రస్తుత పరిస్థితుల్లో కాస్త కుదురుగా కూర్చొని నా మానసిన సమస్యలను పరిష్కరించుకుంటే మంచిదని అనిపించింది. వివరంగా చెప్పలేను కానీ కొన్ని అంశాల్లో నా ఇబ్బందులు కొనసాగుతున్నాయి. నాకు ఎలాంటి గాయం లేదు. మనసు ఎక్కడో ఉండి బరిలోకి దిగి... లేని గాయాలు తెచ్చుకునే పిచ్చి పనిని నేను చేయదల్చుకోలేదు. ఒలింపిక్స్‌కు వచ్చాక నేను నా కోసం కాకుండా ఇంకెవరి కోసమే ఆడుతున్నట్లు అనిపించింది. ఇది నన్ను బాధించింది. పేరు ప్రతిష్టలను పక్కన పెట్టి నా ఆరోగ్యానికి ఏది సరైందో ఆ నిర్ణయం తీసుకోవడం అవసరం. మళ్లీ పోటీల్లో పాల్గొంటానో లేదో చివరి నిమిషం వరకు చెప్పలేను. –సిమోన్ బైల్స్, అమెరికా జిమ్నాస్ట్ -
ఉత్తమ అథ్లెట్లు నందిని, యశ్వంత్
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి అగసారా నందిని అండర్–18 బాలికల విభాగంలో... ఆంధ్రప్రదేశ్ అబ్బాయి యశ్వంత్ కుమార్ అండర్–20 బాలుర విభాగంలో ‘ఉత్తమ అథ్లెట్’ అవార్డులు గెల్చుకున్నారు. అస్సాంలోని గువాహటిలో బుధవారం ఈ పోటీలు ముగిశాయి. నందిని ఈ పోటీల్లో లాంగ్‌జంప్, 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన యశ్వంత్ అండర్–20 బాలుర 110 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు. తెలంగాణ మొత్తం మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి ఎనిమిది పతకాలతో 12వ ర్యాంక్‌లో... ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఐదు పతకాలతో 15వ ర్యాంక్‌లో నిలిచాయి. అనికేత్, దీప్తిలకు రజతాలు చాంపియన్‌షిప్ చివరి రోజు తెలుగు రాష్ట్రాల అథ్లెట్ల ఖాతాలో మరో మూడు పతకాలు చేరాయి. అండర్–18 బాలుర 200 మీటర్లలో అనికేత్ చౌదరి (తెలంగాణ–21.71 సెకన్లు) రజతం సొంతం చేసుకున్నాడు. అండర్–18 బాలికల 200 మీటర్ల లో దీప్తి (తెలంగాణ–24.67 సెకన్లు) కూడా రజత పతకం సాధించింది. అండర్–20 బాలుర 200 మీటర్లలో ఎన్. షణ్ముగ శ్రీనివాస్ (ఆంధ్రప్రదేశ్ –21.60 సెకన్లు) కాంస్యం గెలిచాడు. -
జాతీయ క్రీడలకు తెర
తిరువనంతపురం: పదిహేను రోజులపాటు అలరించిన జాతీయ క్రీడలకు శనివారం తెరపడింది. పురుషుల విభాగంలో స్విమ్మర్ సజన్ ప్రకాశ్, మహిళల విభాగంలో స్విమ్మర్ ఆకాంక్ష వోరా ‘ఉత్తమ అథ్లెట్స్’ పురస్కారాలను అందుకున్నారు. ఈ క్రీడల్లో ప్రకాశ్ ఆరు స్వర్ణాలు గెలిచాడు. సర్వీసెస్ జట్టు వరుసగా మూడోసారి ఓవరాల్ ట్రోఫీ గెల్చుకుంది. కేరళ గవర్నర్ జస్టిస్ (రిటైర్డ్) పి.సదాశివం ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ క్రీడలు ముగిశాయని ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ చదివి వినిపించారు. తమ ప్రతిభతో రాణించిన క్రీడాకారులందరికీ తన సందేశంలో ప్రధాని అభినందించారు. తదుపరి జాతీయ క్రీడలు వచ్చే ఏడాది గోవాలో జరుగుతాయి. -
‘ఉత్తమ అథ్లెట్’ సత్యవాన్
ముగిసిన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ విజయవాడ స్పోర్ట్స్: జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అండర్-14 బాలుర విభాగంలో తెలంగాణకు చెందిన సత్యవాన్ ‘ఉత్తమ అథ్లెట్’గా ఎంపికయ్యాడు. అతను షాట్‌పుట్‌లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో కేరళ ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అండర్-14 బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు టీమ్ టైటిల్ దక్కింది. చివరిరోజు జరిగిన అండర్-20 బాల, బాలికల 4ఁ400 మీటర్ల రిలేలో ఆంధ్రప్రదేశ్ బృందాలకు కాంస్య పతకాలు లభించాయి. ఓవరాల్‌గా ఈ పోటీల్లో ఎనిమిది అంశాల్లో కొత్త జాతీయ రికార్డులు నమోదయ్యాయి.