PC: IPL Twitter
నిన్న పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఇక మిగిలింది 9 జట్లు. వీటిలో సన్‌రైజర్స్, కేకేఆర్ జట్లు కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించాయి. అయితే టెక్నికల్‌గా వారి అవకాశాలను కొట్టిపారేయడానికి వీల్లేదు.
సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు: 11 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ తాము ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిచి నెట్‌రన్‌రేట్‌ను భారీగా మెరుగుపర్చుకోవడమే కాకుండా, మిగతా జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంది.
కేకేఆర్: 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న కేకేఆర్.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిచి నెట్‌రన్‌రేట్‌ను భారీగా మెరుగుపర్చుకోవడమే కాకుండా, మిగతా జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంది.
ఆర్సీబీ: 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు (-0.345) సాధించి, పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న ఆర్సీబీ.. తాము ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిచి, నెట్ రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. రాజస్థాన్, ముంబై, పంజాబ్, లక్నో జట్ల గెలుపోటములు కూడా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలను ప్రభావితం చేయనున్నాయి.
పంజాబ్: 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు (-0.268) సాధించి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న పంజాబ్.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిస్తే నేరుగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఒక్క మ్యాచ్‌లో ఓడితే ఆర్సీబీ, రాజస్థాన్, ముంబై, లక్నో జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇదే జరిగితే రన్‌రేట్ కీలకంగా మారుతుంది.
రాజస్థాన్: 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు (0.633) సాధించి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న రాజస్థాన్.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒక్క మ్యాచ్‌లో ఓడినా రన్‌రేట్ కీలకంగా మారుతుంది.
లక్నో: 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 13 పాయింట్లు (0.309) సాధించి, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న లక్నో.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒక్క మ్యాచ్‌లో ఓడినా ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే.. రాజస్థాన్, పంజాబ్, ఆర్సీబీ, ముంబై జట్లు తలో మ్యాచ్ ఓడిపోవాల్సి ఉంటుంది. ఇదే జరిగితే లక్నో 15 పాయింట్లతో ఫైనల్ ఫోర్‌కు చేరుకుంటుంది. రాజస్థాన్, పంజాబ్, ఆర్సీబీ టీమ్‌లు 14 పాయింట్లతో లీగ్ నుంచి నిష్క్రమిస్తాయి.
ముంబై: 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు (-0.117) సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ముంబై.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒక్క మ్యాచ్‌లో ఓడినా ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే.. రాజస్థాన్ కంటే మెరుగైన రన్‌రేట్ సాధించడమో లేక రాజస్థాన్ ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో ఓటమిపాలయ్యేందుకు ఎదురు చూడాలి.
సీఎస్‌కే: 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 15 పాయింట్లు (0.493) సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సీఎస్‌కే.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. అదే రెండు గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు చేరే రెండో జట్టుగా నిలుస్తుంది.
గుజరాత్: 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు (0.761) సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా టేబుల్ టాపర్‌గా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment