IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఔట్‌.. | SunRisers Hyderabad Qualify For Playoffs, Delhi Capitals Eliminated | Sakshi
Sakshi News home page

IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఔట్‌..

Published Thu, May 16 2024 11:26 PM | Last Updated on Fri, May 17 2024 10:15 AM

SunRisers Hyderabad Qualify For Playoffs, Delhi Capitals Eliminated

ఐపీఎల్‌-2024లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కథ ముగిసింది. ఈ ఏడాది సీజ‌న్‌లో ఎలాగైనా టైటిల్‌ సాధించి త‌మ 17 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించాల‌ని భావించిన ఢిల్లీకు మ‌రోసారి నిరాశే ఎదురైంది. ఐపీఎల్‌-2024 ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిట‌ల్స్ అధికారికంగా నిష్క్ర‌మించింది.

ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, గుజ‌రాత్ టైటాన్స్ మధ్య  మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయింది. దీంతో ఇరు జ‌ట్లకు చెరో పాయింట్ ల‌భించింది. ఈ క్ర‌మంలో ఎస్ఆర్‌హెచ్ 15 పాయింట్ల‌తో ప్లే ఆఫ్స్‌కు ఆర్హ‌త సాధించింది.

ఎస్ఆర్‌హెచ్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖారారు చేసుకోవ‌డంతో ఢిల్లీ ఆశ‌లు ఆడియాశలు అయ్యాయి. ఒక ఈ మ్యాచ్ జ‌రిగి ఎస్ఆర్‌హెచ్ ఓట‌మి పాలై ఉంటే మాథ్య‌మేటిక‌ల్‌గా ఢిల్లీకి ప్లే ఆఫ్స్ చేరే ఛాన్స్ ఉండేది. 

కానీ ఇప్పుడు ఏకంగా మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో పంత్ సేన ఇంటిముఖం ప‌ట్టింది. ఈ ఏడాది సీజ‌న్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ ఏడింట విజ‌యాలు,  ఏడింట ఓట‌మి పాలైంది. పాయింట్ల ప‌ట్టిక‌లో 5వ స్ధానంతో స‌రిపెట్టుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement