
Playoff Matches Likely To Be Played In Lucknow And Ahmedabad: ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభమై పట్టుమని పది రోజులు కూడా కాలేదు అప్పుడే ప్లే ఆఫ్స్ ముచ్చటేందీ అనుకుంటున్నారా..? అయితే, ఈ వార్త పూర్తిగా చదవండి. మార్చి 26న ప్రారంభమైన ఐపీఎల్ 15వ ఎడిషన్‌కు సంబంధించి లీగ్ మ్యాచ్‌లను మహారాష్ట్రలో (ముంబై, పూణే) నిర్వహిస్తున్న బీసీసీఐ.. ప్లే ఆఫ్స్‌ను ఎక్కడ నిర్వహిస్తారన్న విషయమై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
తొలుత ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్ (గుజరాత్)లోని మొతేరా స్టేడియంలో నిర్వహించాలని భావించిన బీసీసీఐ.. దేశంలో కోవిడ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వేదికలను విస్తరించాలని యోచిస్తుంది. ఇందులో భాగంగా ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లను గుజరాత్‌తో పాటు లక్నో నగరంలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు దఫాలు చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.
అహ్మదాబాద్ (గుజరాత్ టైటాన్స్), లక్నో (లక్నో సూపర్ జెయింట్స్) ఫ్రాంచైజీలు ఈసారి ఐపీఎల్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో అక్కడి అభిమానులు కూడా తమ సొంత గ్రౌండ్‌లో మ్యాచ్‌లు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ.. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లను అహ్మదాబాద్, లక్నోల్లో నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా, మే 22తో ఐపీఎల్ లీగ్ దశ ముగుస్తుంది. అనంతరం ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు మరో వారం రోజుల పాటు జరుగుతాయి. మే 29న ఐపీఎల్ ఫైనల్ జరుగుతుంది.
చదవండి: 'ఏంటి రాహుల్ భయపడ్డావా, ఫైన్ వేస్తారని'.. వీడియో వైరల్!