ఐపీఎల్ 2022 సీజన్ ద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇవాళ (మార్చి 28) వాంఖడే వేదికగా తలపడనున్నాయి. క్లోజ్ ఫ్రెండ్స్ అయిన హార్ధిక్ పాండ్యా (గుజరాత్), కేఎల్ రాహుల్ (లక్నో) కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న ఈ రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరు రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. ఈ అరంగేట్రం మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు ఆరాటపడుతున్నాయి. కేఎల్ రాహుల్‌కు గతంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా పనిచేసిన అనుభవముండగా, హార్ధిక్ కెప్టెన్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి.
ఇరు జట్ల బలాబలాల విషయానికొస్తే.. గుజరాత్‌తో పోలిస్తే ఎల్‌ఎస్‌జీ కాస్త బలంగా ఉందనే చెప్పాలి. కేఎల్ రాహుల్, ఎవిన్ లూయిస్, మనీష్ పాండే, క్వింటన్ డికాక్ వంటి స్టార్లతో లక్నో బ్యాటింగ్ విభాగం దృడంగా కనిపిస్తుండగా.. శుభ్‌మన్ గిల్, రహ్మనుల్లా గుర్బాజ్, డేవిడ్ మిల్లర్ లాంటి బ్యాటర్లను ఎంపిక చేసుకున్న గుజరాత్ టీమ్ చాలా బలహీనంగా కనిపిస్తుంది. ఆల్రౌండరలవిభాగంలో మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా, జేసన్ హోల్డర్‌లతో లక్నో జట్టు అరివీరభయంకరంగా కనిపిస్తుండగా.. హార్ధిక్ పాండ్యా, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్‌లతో గుజరాత్ ఈ విభాగంలో కాస్త పర్వాలేదనిపిస్తుంది.
ఇక బౌలర్ల విషయానికొస్తే.. అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, కృష్ణప్ప గౌతమ్, అంకిత్ రాజ్‌పుత్, దుష్మంత్ చమీర, ఆండ్రూ టైలతో ఎల్‌ఎస్‌జీ.. మహ్మద్ షమీ, ఫెర్గూసన్, డొమినిక్ డ్రేక్స్‌లతో గుజరాత్ పర్వాలేదనిపిస్తున్నాయి.
తుది జట్లు (అంచనా):
లక్నో సూపర్ జెయింట్స్ : కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఎవిన్ లూయిస్, క్వింటన్ డికాక్, మనన్ వోహ్రా (లేదా) కృష్ణప్ప గౌతమ్, మనీష్ పాండే, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అంకిత్ రాజ్‌పుత్, దుష్మంత్ చమీర (లేదా) ఆండ్రూ టై
గుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్, అభినవ్ మనోహర్, హార్థిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, ఫెర్గూసన్, రవి శ్రీనివాసన్, సాయి కిషోర్ (లేదా) ప్రదీప్ సాంగ్వన్
చదవండి: IPL 2022: లక్నోతో మ్యాచ్‌కు ముందు హార్దిక్ పాండ్యా బోల్డ్ స్టేట్‌మెంట్.. వైరల్
Comments
Please login to add a commentAdd a comment