IPL 2023 LSG VS GT Match Updates, Highlights - Sakshi
Sakshi News home page

LSG VS GT: గుజరాత్‌ సంచలన విజయం

Published Sat, Apr 22 2023 3:04 PM | Last Updated on Sat, Apr 22 2023 7:24 PM

IPL 2023 LSG VS GT Match Updates, Highlights - Sakshi

లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఏడు పరుగుల తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్‌జెయింట్స్‌ ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు కోల్పోయి చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుంది.

ఆఖరి ఓవర్లో 12 పరుగులు అవసరమైన దశలో మోహిత్‌ శర్మ సూపర్‌ బౌలింగ్‌ వేశాడు. తొలి బంతికి రెండు పరుగులు రాగా.. ఆ తర్వాత వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగా.. ఇందులో మోహిత్‌ రెండు వికెట్లు తీయగా.. మిగతా రెండు రనౌట్ల  రూపంలో వచ్చాయి. కేఎల్‌ రాహుల్‌ 68 పరుగులు చేసినప్పటికి జట్టును గెలిపించడంలో విఫలమయ్యాడు. గుజరాత్‌ బౌలర్లలో నూర్‌ అహ్మద్‌, మోహిత్‌ శర్మలు చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్‌ ఖాన్‌ ఒక వికెట్‌ తీశాడు.

మూడో వికెట్‌ కోల్పోయిన లక్నో
గుజరాత్‌, లక్నో మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతుంది. ఒక్క పరుగు మాత్రమే చేసిన పూరన్‌ నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం లక్నో విజయానికి 12 బంతుల్లో 17 పరుగులు కావాలి.

కృనాల్‌ పాండ్యా ఔట్‌.. రెండో వికెట్‌ కోల్పోయిన లక్నో 
23 పరుగులు చేసిన కృనాల్‌ పాండ్యా నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో స్టంప్‌ అవుట్‌గా వెనుదిరిగాడు.  ప్రస్తుతం లక్నో రెండు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. రాహుల్‌ 60, పూరన్‌ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. లక్నో విజయానికి 24 బంతుల్లో 27 పరుగులు కావాలి.

విజయానికి దగ్గరలో లక్నో సూపర్‌జెయింట్స్‌
గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ విజయానికి దగ్గరైంది. 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ప్రస్తుతం వికెట్‌ నష్టానికి 104 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 56, కృనాల్‌ పాండ్యా 23 పరుగులతో ఆడుతున్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన లక్నో.. మేయర్స్‌ (24) ఔట్‌
136 పరుగుల లక్ష్య ఛేదనలో 55 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్‌ కోల్పోయింది. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో కైల్‌ మేయర్స్‌ (24 ) ఔటయ్యాడు. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 55/1గా ఉంది. 

టార్గెట్‌ 136.. 5 ఓవర్లలో 46/0
136 పరుగుల అతి సాధారణ లక్ష్య ఛేదనలో లక్నో ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. 5 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు వికెట్‌ నష్టాపోకుండా 46 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (25), కైల్‌ మేయర్స్‌ (21) బ్యాట్‌ను ఝులిపిస్తున్నారు. 

రాణించిన లక్నో బౌలర్లు.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన గుజరాత్‌ 
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో నిర్ణీత ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 135 పరుగుల నామమాత్రపు స్కోర్‌ చేసింది. వృద్ధిమాన్‌ సాహా (47), కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా (66) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్‌ ఉల్‌ హాక్‌ (4-0-19-1), కృనాల్‌ పాండ్యా (4-0-16-2)
స్టోయినిస్‌ (3-0-20-2), అమిత్‌ మిశ్రా (2-0-9-1) సత్తా చాటారు.  

హార్ధిక్‌ ఔట్‌
స్టోయినిస్‌ బౌలింగ్‌లో రాహుల్‌ క్యాచ్‌ పట్టడంతో హర్ధిక్‌ పాండ్యా (66) ఔటయ్యాడు.   

విజయ్‌ శంకర్‌ క్లీన్‌ బౌల్డ్‌.. నాలుగో వికెట్‌ డౌన్‌
నవీన్‌ ఉల్‌ హాక్‌ బౌలింగ్‌లో విజయ్‌ శంకర్‌ (10) క్లీన్‌ బౌల్డయ్యాడు. నవీన్‌ ఉల్‌ హాక్‌కు ఇది ఐపీఎల్లో తొలి వికెట్‌. 15 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్‌ 92/4గా ఉంది. హార్ధిక్‌ (32), మిల్లర్‌ క్రీజ్‌లో ఉన్నారు.  

సూపర్‌ క్యాచ్‌.. మూడో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
అమిత్‌ మిశ్రా బౌలింగ్‌లో నవీన్ ఉల్‌ హాక్‌ సూపర్‌ క్యాచ్‌ పట్టడంతో అభినవ్‌ మనోహర్‌ (3) ఔటయ్యాడు. 12 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 78/2. హార్ధిక్‌ (27), విజయ్‌ శంకర్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు.  

రెండో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
47 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో సాహా ఔటయ్యాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన సాహా.. దీపక్‌ హుడాకు సునాయాసమైన క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 11 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 75/2గా ఉంది. హార్ధిక్‌ (26), అభినవ్‌ మనోహర్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు. 

నత్తనడకన సాగుతున్న గుజరాత్‌ బ్యాటింగ్‌
రెండో ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌.. ఆ తర్వాత మరో వికెట్‌ పడకుండా ఆచితూచి ఆడుతుంది. హార్దిక్‌ (10 బంతుల్లో 6) నిదానంగా ఆడుతూ బోర్‌ కొట్టిస్తుండగా.. సాహా (24 బంతుల్లో 34) కాస్త ధాటిగా ఆడుతున్నాడు. 6 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 40/1. 

గుజరాత్‌ టైటాన్స్‌కు ఆదిలోనే షాక్‌
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న గుజరాత్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. కృనాల్‌ పాండ్యా వేసిన రెండో ఓవర్‌లోనే శుభ్‌మన్‌ గిల్‌ (0) ఔటయ్యాడు.3 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 13/1. సాహా (9), హార్ధిక్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు.  

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌
ఐపీఎల్‌ 2023లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 22 మధ్యాహ్నం 3:30 గంటలకు) లక్నో సూపర్‌ జెయింట్స్‌-గుజరాత్‌ టైటాన్స్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్‌ కీపర్‌), శుభ్‌మన్ గిల్, విజయ్‌ శంకర్‌, అభినవ్‌ మనోహర్‌, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్‌ అహ్మద్‌, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్‌), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్(వికెట్‌ కీపర్‌), ఆయుష్‌ బదోని, కృనాల్ పాండ్యా, అమిత్ మిశ్రా, ఆవేశ్‌ ఖాన్‌, నవీన్‌ ఉల్‌ హాక్‌, రవి బిష్ణోయ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement