GT VS LSG: ఐపీఎల్ 2022లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఇవాళ (మార్చి 29) జరగనున్న ఆసక్తికర మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఆ రికార్డులు ఏంటంటే.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఇవాల్టి మ్యాచ్‌లో మరో రెండు సిక్సర్లు, మరో 3 ఫోర్లు బాదితే ఐపీఎల్‌లో 100 సిక్సర్‌లు, 100 ఫోర్లను పూర్తి చేసుకుంటాడు. హార్ధిక్ ఖాతాలో ఇప్పటివరకు 97 ఫోర్లు, 98 సిక్సర్‌లు ఉన్నాయి. అలాగే హార్ధిక్ ఈ మ్యాచ్‌లో మరో 24 పరుగులు చేస్తే ఐపీఎల్ కెరీర్‌లో 1500 పరుగుల మైలురాయిని అందుకుంటాడు. హార్ధిక్ ఇప్పటివరకు 92 మ్యాచ్‌ల్లో 4 హాఫ్ సెంచరీల సాయంతో 1476 పరుగులు చేశాడు.
ఇక లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రికార్డుల విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌కు ముందు రాహుల్‌ను రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. గుజరాత్‌తో మ్యాచ్‌లో రాహుల్ మరో రెండు ఫోర్లు బాదితే టీ20 ఫార్మాట్‌లో 500 ఫోర్లు పూర్తి చేసుకుంటాడు. అలాగే మరో హాఫ్ సెంచరీ బాదితే పొట్టి ఫార్మాట్‌లో 50 హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకుంటాడు. రాహుల్ తన ఐపీఎల్ కెరీర్‌లో 94 మ్యాచ్‌ల్లో 47 సగటున 3273 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదే మ్యాచ్‌లో వీరిద్దరినే కాకుండా గుజరాత్ టైటాన్స్ ఆటగాడు డేవిడ్ మిల్లర్‌ను కూడా ఓ రికార్డు ఊరిస్తుంది. మిల్లర్ మరో 26 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 2 వేల పరుగుల మార్కును అందుకుంటాడు. మిల్లర్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 89 మ్యాచ్‌ల్లో 32 సగటున 1974 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: IPL 2022: క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య ఆసక్తికర పోరు.. గెలుపుతో బోణీ కొట్టాలని..!
Comments
Please login to add a commentAdd a comment