
MS Dhoni(Photo Courtesy: CSK Instagram)
ipl final match: ధోని ప్రాక్టీస్ వీడియో వైరల్
MS Dhoni Practices Helicopter Shot Video Goes Viral: కరోనా కారణంగా వాయిదా పడి.. సెప్టెంబరు 19న పునః ప్రారంభమైన ఐపీఎల్-2021 తుది అంకానికి చేరుకుంది. సూపర్ ఆటతో తొమ్మిదోసారి ఫైనల్‌కు చేరిన చెన్నై సూపర్ కింగ్స్... ఈ సీజన్‌లో పడిలేచిన కెరటంలా దూసుకొచ్చిన కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య నేడు(అక్టోబరు 15)న తుది పోరు జరుగనుంది. క్యాష్ రిచ్ లీగ్‌లో జరుగనున్న ఈ ఆసక్తికర ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
మరోవైపు టైటిల్ సాధించాలన్న కసితో ఉన్న మాజీ చాంపియన్లు.. ప్రాక్టీసులో తలమునకలయ్యాయి. ఈ క్రమంలో సీఎస్‌కే.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న తమ ఆటగాళ్ల వీడియోను షేర్ చేసింది. ఇది చెన్నై అభిమానులను.. ముఖ్యంగా తలా ధోని ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది.
మిస్టర్ కూల్ తనదైన శైలిలో హెలికాప్టర్ షాట్ ప్రాక్టీసు చేయడం ఇందులో చూడవచ్చు. మరోవైపు.. సురేశ్ రైనా సైతం వీడియోలో కనిపించడంతో తుది జట్టులో అతడు చోటుదక్కించుకుంటాడా.. లేదంటే రాబిన్ ఊతప్ప వైపే సారథి మొగ్గు చూపుతాడా అని నెటిజన్లు చర్చలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
చదవండి: IPL Final CSK Vs KKR: అతనే బలం... ‘సూపర్’ దళం!