![ఐపీఎల్ ఫైనల్ టిక్కెట్లున్నాయ్.. త్వరపడండి](/styles/webp/s3/article_images/2017/09/5/71495174231_625x300.jpg.webp?itok=eIZ1d6Gy)
ఐపీఎల్ ఫైనల్ టిక్కెట్లున్నాయ్.. త్వరపడండి
హైదరాబాద్: తెలుగు గడ్డపై తొలిసారిగా జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి. ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ తిలకించేందుకు టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. మ్యాచ్‌కు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ నెల 21న (ఆదివారం) రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
రూ. 1500, రూ.2000, రూ.4000 టికెట్లు కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నట్టు అధికారిక వెబ్‌సైట్ ‘బుక్‌మైషో’ గురువారం వెల్లడించింది. ఉప్పల్ మైదానంలో కనీస టిక్కెట్ ధర రూ. 800, అత్యధిక టిక్కెట్ ధర రూ. 7500. అయితే ఈ రెండు విభాగాల్లో టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి.
స్టేడియం కెపాసిటీ 30 వేలు ఉండగా రెండు వేల సీట్లకు హోర్డింగులు అడ్డు వస్తున్నందున్న రద్దు చేశామని హెచ్‌సీఏ కార్యదర్శి శేష్ నారాయణ్ తెలిపారు. మిగిలిన 28 వేల సీట్లలో 19 వేల టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడు పోయాయని మిగిలిన టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. జింఖానా గ్రౌండ్‌లోనూ ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తున్నట్లు తెలిపారు.